ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఈడి_____ఈడు 182 ఈడు_____ఈడు
- "వీరభద్రుండు....ఏడు జిహ్వలు వెర్కి యీడాడినట్లు." పండితా. ద్వితీ. మహి. పుట. 9.
- "ఓడ కోడకు దేవి యుగ్రరాక్షసుని నీడాడి నీచెఱ నే విడిపింతు." రంగ. రా. ఆర. 181. పుట.
ఈడిగిలబడు
- వెనుకకు కూలబడు.
- "వాడు అంతదూరం నడవ లేక ఈడిగిల బడుతూ ఈడిగిలబడుతూ వచ్చాడు." వా.
- చూ. ఈడిగలు.
ఈడిగిలు
- "ఆపెనసరి వ----రాలు మొఱవెట్టుచు నీడిగిలన్." జైమి. 2. 111.
- చూ. ఈడిగిలబడు.
ఈడిగిల్లు
- చూ. ఈడిగిలు.
ఈడు కాదు
- సమ ఉజ్జీ కాదు.
- "చూచెదరు గాని సభికులు, నీ చిన్ని కుమారకులకు నీ మల్లురకున్, ఓ చెల్ల! యీడు కా దని, సూచింపరు..." భాగ. పూర్వ. 10. 1351.
- ఇది నేటివాడుకలో వివాహ విషయంలోనే మిగిలినది - ఆ పిల్ల వీడికి ఈడు కాదు అను రీతిగా.
- "అంత దృఢంగా వున్న పిల్లకు ఈ జేనెడువెధవ ఎలా ఈ డవుతాడు." వా.
ఈడు చాలదు
- తగినంత వయసు లే దనుట.
- "వాని కివ్వడానికి మాపిల్ల ఈడు కాదే అనే నా ఆలోచన." వా.
ఈడు జో డాడు
- ఒకటి నొకటి అతిశయించు; ఒకరిని మరొకరు మించు.
- "అట్లు మామయు నల్లుండు నఖిల బంధు, సమితియును మీడు జోడాడి సంభ్రమింప...." రాజశే. 3. 190.
- "దరస్మిత క్రీడాభరంబు లీడు జోడాడ." శుక. 1. 133.
ఈడుజోడు
- 1. సమానము. జం.
- "నీకు లోకములయందు నీడుజోడును లేదు." దశా. 2. 80.
- "వసుధ బుట్టెడు పెరి గెడువారిలోనం, గని విని యెఱుంగ మంతటి ఘనుని నౌర, యీడుజోడును సరిసాటి యెందు లేద, తం డమర్త్యుండు గాక మర్త్యుండె తలప?" సారం. 155.
- పాండు. 1. 46.
- 2. వివాహానికి వధూవరుల అనురూపత.
- "వీ ళ్లిద్దరికీ పెళ్ళి చేస్తే చక్కని ఈడుజోడు." వా.
ఈడుపడు
- సమానమగు, సరిపడు-కుదురు. పాండు. 1. 46.
- దక్షిణాంధ్రంలో నేటికీ విన వస్తుంది.
- "ఆ ఊరికి పోయి చాలా ప్రయత్నం చేశాను. కానీ ఆపని యీడుపడ లేదు." వా.
- చూ. ఈడ్వడు.
ఈడుబండాడు
- పరుగెత్తు.
- "కుందేళ్ల గన్నట్టి కుక్కలభాతి,