ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇడ్డ_____ఇత 155 ఇత______ఇద
- "కడు బ్రియ మెలర్ప గౌగిట, నిడుము కొని...." శుక. 1. 305.
ఇడ్డబొట్టు వలె
- కదలకుండా.
- పెట్టుకొన్నబొట్టు అని ఇం దాకా ఇడ్డబొట్టును అందరూ అంటున్నారు.
- ఇ దింతేనా అని సందేహం. బొట్టులాగా అనడంకంటే మఱిం కేదైనా విశేషార్థ ముందేమో అనిపిస్తుంది.
- ఆలోచింపవలసి ఉన్నది. ఇంకా తేల లేదు.
- "ఇడ్డబొట్టువోలె నింటిలో నుండక." కుమా. 6. 16.
ఇత:పరము
- ఇంతకంటె వేఱు.
- "నీవే తప్ప నిత:పరం బెఱుగ." భాగ. 8. 90.
ఇత డెంత వాడు?
- వీ డెంత?
- "ఇంతింతవారల కీశ్వరావసర, మింత దుర్ఘట మన్న నిత డెంతవాడు."
- పండితా. ప్రథ. పురా. పుట. 379.
ఇతని కితండె సాటి
- ఇతనికి సమానుడు లేడు అనుట, అప్రతిమానుడు.
- "ఇతనికితండె సాటి యగు నీతని కీతడె సాటి వచ్చు." పారి. 5. 29.
ఇతర మనక
- ఏమీ అనక.
- ఇం కేమీ అనక అన్నది వాడుకలో రూపము.
- "ఏమి సేయుదు మని ధూర్తు నితర మనక, డెందమున సందియ మొకింత చెంద కపుడు." హంస. 2. 215.
ఇత రేతరమతి
- అన్యోన్యబుద్ధి.
- "ఇత రేతరమతి సంభా, వితలక్షణకలన మొంది." భార. శాంతి. 6. 454.
ఇతి కర్తవ్యతామూడుడు
- ఏమి చేయుటకూ దిక్కు తోచనివాడు.
ఇతోధికంగా
- ఇంతకంటే ఎక్కువగా. మంచి జరుగుతుం దన్న సందర్భంలోనే దీనిని ఉపయోగిస్తారు.
- "ఈసారి సకాలంలో వానలు కురవడం వల్ల యితోధికంగా పంటలు పండవచ్చు నని రైతులు సంతోషిస్తున్నారు." వా.
ఇత్యాదులు
- మొదలగునవి, వగైరా.
- "ఉప్పూ, చింతపండూ, మిరపకాయలూ ఇత్యాదు లన్నీ ఆ అంగట్లోనే కొంటూ ఉంటాము." వా.
ఇదంతన మైన
- ఆధునిక మైన, ఇప్పటి దనుట.
ఇదమిత్థ మను
- నిర్ధరించి చెప్పు.
- "ఇది గాక శమనకృత్యం, బిద మిత్థ మ్మనగ గూడదు." దశా. 2. 142.
- "ఈవ్యాజ్యం ఎలా పరిణమిస్తుందో ఇదమిత్థ మని చెప్ప లేము." వా.