ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆవ_____ఆవు 132 ఆవు_____ఆశ
ఆవలిమో మిడు
- అయిష్టము సూచిస్తూ మాఱు మొగము పెట్టు.
- "ఆవలిమో మిడి తా గ్రోలె." విప్ర. 2. 68.
- చూ. మాఱుమో మిడు.
ఆవిడ
- భార్య; ఆమె.
- "మా ఆవిడ దీనికి సుతరామూ ఒప్పుకోవడం లేదు." వా.
- " మీ ఆవిడతో చెప్తాను ఉండండి. మీ రేమో మహా ఖర్చు పెట్టేస్తున్నారు." వా.
- "ఆవి డెవరు?" వా.
ఆవుగోవు
- సాధువు.
- "ఆయన దేముంది పాపం ! ఆవుగోవు."
ఆవును చంపి చెప్పులు దానం చేయు
- అల్ప మైన మంచిపని కోసం మహాపాపానికి ఒడిగట్టు.
- "వాడు ఆవును చంపు చెప్పులు దానం చేస్తాడు. ఏమి లాభం?" వా.
ఆవురు మను
- వాపోవు.
- కొత్త. 303.
ఆవుర్న నోరు దెఱచు
- ఆవురు మని నోరు తెఱుచు. క్రీడా. పు. 73.
ఆవులాంటివాడు
- సాధువు.
- "ఆయన కే పాపం తెలియదు. ఆవులాంటివాడు." వా.
ఆవులింతలు వచ్చు
- చూ. ఆవలింపులు వచ్చు.
ఆవులిస్తే ప్రేవులు లెక్క పెట్ట గల
- అతినిశితబుద్ధి అయిన; ఎదుటి వానిసత్తాసారం గ్రహించగల.
- "వాడు ఆవులిస్తే ప్రేవులు లెక్క పెట్ట గలవాడు. వాడిదగ్గర మన ఆట లేవీ సాగవు." వా.
ఆవులు తలచినచోట పూరి మొలిచినట్లు
- చక్కని సౌకర్యం ఏర్పడిన దనుట. ఆవులు మఱొక చోటికి వెళ్ళకుండా అనుకున్న చోటనే పచ్చిక మొలిస్తే మఱిం కేమి?
- పండితా. ప్రథ. పురా. పుట. 387.
ఆవులువారు
- అలసిపోవు, ఆవులింతలు వచ్చు స్థితికి వచ్చు.
- "ఆవులువారెడిమేని అలుపులతోడ." తాళ్ల. సం. 3. 403.
ఆవేశకావేషాలు
- కోపోద్రేకాలు. జం.
- "ఆవేశకావేషాలు పెచ్చు పెరిగి ఆఊళ్లో ఖూనీలు జరిగా యట." వా.
ఆశకు మట్టు లేదు.
- ఇంత ఆశ అయితే ఎలా అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- బాణాల. కాళ. 10.