ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆపూ_____ఆపో 121 ఆపో_____ఆబు
కనిపించినా లోతుగా చూస్తే అలా ఉండదు అనే అర్థంలో కూడా ఉపయోగిస్తారు.
- "ఇది కేవలం ఆపాతరమణీయమైన మాట. ఆలోచిస్తే యిందులో సారం నిస్సారమే అని నీకే తేలుతుంది."
- చూ. ఆపాతమధురం, అవిచారితరమణీయము.
ఆపూటకు లేని
- మిక్కిలి పేద యైన.
- "ఆపూటకు లేనివాడే అంత మిడిసిపడితే యింక ఉన్న వాడిసంగతి చెప్పాలా? వా.
ఆపేరికూర నంజమి
- ఆపేరే పడదనుట.
- "భీమధంవుండు దినిన నా పేరి కూర నంజ నే నిది వెలి గాగ నాకు నొక్క." దశకు. 10. 18.
- చూ. ఆతని పేరికూర నంజు.
ఆపైన దేవు డున్నాడు
- చేయగలిగింది చేసితి ననుట.
- "నేను చేయగలిగింది చేశాను. ఆపైన దేవు డున్నాడు." వా.
ఆపోవని
- సంతృప్తి చెందని.
- "కోపము నుబ్బును గర్వము, నాపోవని యునికియును దురభిమానము ని, ర్య్వా పారత్వము ననునవి, కా పురుషగణంబు లండ్రు కౌరవనాథా!" భార. ఉద్యో. 1 ఆ.
ఆపోశనము పట్టు
- సంధ్యావందనాదులలో తర్జనితో చూపుడువేలిని మడిచి ఆ అరచేతిలో ఏర్పడు పల్లములో తీర్థము పోసుకొని మంత్రపూర్వకముగా తీసుకొనుటకు ఆపోశనంఅంటారు. ఆవిధముగా జలమును లోనికి తీసికొను.
- "బడబాగ్ని వడికి లోపడని పాథోరాశి భోరున గొనియె నాపోశనముగ." కా. మా. 1. 124.
ఆపోశనించు
- ఆపోశనము గొను.
- "దివ్యాస్త్రనైపుణి ... ప్రాణములు నాపోశనింపగా నాశించె."
- వర. రా. యు. పు 240 పంక్తి 13.
ఆప్రొద్దు పొయి రాజనట్టి
- ఆపూటకుకూడ గడవని (పేద).
- "ఆప్రొద్దు పొయిరాజనట్టి నిఒర్పేదయు." పాండు. 1. 101.
ఆబాలగోపాలము
- చూ. ఆబాలవృద్ధాదులు.
ఆబాలవృద్ధాదులు
- అందఱూ.
- చిన్నా పెద్దా అంతా అని నేటి వాడుక
- పండితా. ప్రథ. దీక్షా. పుట. 161.
- చూ. ఆబాలగోపాలము.
ఆ బుర్రలో విత్తనాలే
- అదే రకమే అనుట.
- కూరగాయల విత్తనాల వంటి వానిని సొరకాయ బుర్రలో వేసి ఉంచే అలవాటుపై యేర్పడినది. ఒకేబుర్రలో ఒకరకమైన విత్తనాలే వేస్తారు.