పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

గురు వాక్యం

డా || కలిదిండి వెంకటరామరాజు,
భాషాప్రవీణ, ఎమ్.ఏ., పి.హెచ్.డి
రీడర్ (రిటైర్డ్),
దాసుడు వీధి, బలుసుమూడి,
భీమవరం -2.

డా|| గాదం గోపాలస్వామిగారు ఆత్మవిశ్వాసంతో, దీక్షాదక్షతలతో, పరిశోధనాత్మక దృక్షధంతో రచించిన ఈ ' పశ్చిమగోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము " అను గ్రంథము సర్వవిధముల ప్రశంసార్షమై ఉన్నది. సువిశాలభావ సంపనుడైన ఈ రచయిత యొక్క రచనా పాటవముకు, సమకాలిక భావస్తుందనలకు, గాంధేయు సిద్ధాంత విశ్వాసాభిమానులకు, సువిమర్శనాత్మక ధోరణికి, నిరర్గళధారాశుద్ధితో సాగిన సరళభాషా శైలికిని ఈ గ్రంథము ఒక నిదర్శనము. అధ్యాపకుడుగా, పరిణత పరిశీలకుడు గాను విశేషానుభవాన్ని గడించియుండుటచే వీరి రచనలో స్పష్టప్రతిపత్తి, భావ పరిపుష్టియు కానవచుచున్నవి. గంభీరమైన ఆలోచన, దేశభక్త సత్కధర్మనిరతి, అహింసా మార్గము, నీతినియమ సంపన్షత, సదభ్యాసాలు, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అను వాని సరస సమ్మేళనమే ఈ సద్దంథ భూమిక.

"Fire arts are those in which the aimed, the heart and the hand go together"

అని ఒక ఆంగ్ల విమర్శకుడు అన్న పదం ఈ రచయిత యొక్క బుద్ధిబలము, సుస్థిర మనసికస్థితిగతులు, రమణీయురచనా రూపంలో సాగిన హరెన్న విన్యాన వైఖరియయిను ఏకోన్ముఖంగాసాగి తమ ప్రభావమును చూపినవి.

ఈగ్రంథమున రూపొందింపబడిన " పరిచయము - తొలిప్రయోగాలు,