పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/79

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

విరాళములు వచ్చినందుకు గాంధీజీ మిగుల ఆనందించారు. ఆంధ్ర రాష్ట్ర హరిజన సేవక సంఘ కార్యదర్శి మాగంటి బాపినీడు గాంధీజీ ఆంధ్రదేశంలో హరిజనయాత్రను ముగించిన తరువాత జిల్లాల వారీగా ధన, వస్తు రూపములలో వచ్చిన "హరిజన నిధిని ప్రకటించారు. తెలియచేసిన వివరముల ప్రకారం హరిజన నిధికి నెలూరు జిల్లా రొట్టము రూపములో ప్రధమ స్థానమును పొందగా, పశ్చిమగోదావరి జిల్లా ద్వితీయ స్థానముపొందింది. బంగారు ఆభరణములు ఇచ్చుటలో పశ్చిమగోదావరి කිසිඳාදී ప్రధమస్థానమునలంకరించగా, ଠି ୧୬:୧୪, ద్వితీయ స్థానముపొందింది. 17

గాంధీజీ దక్షిణ భారత హిందీ ప్రచారసభకు అధ్యక్షత వహించుటకై మదరాసు వెళుతూ 1946, జనవరి 26వ తేదీన రాత్రి 8గం|లకు గాంధీజీ బయలుదేరిన ప్రత్యేక రైలు ఏలూరు స్టేషనునందు ఆగతుందనే వార్త ప్రజలకు తెలిసింది. వ్యవధి తక్కువైనప్పటికీ రాత్రి గం| 7.30నిuలు అయ్యేసరికి రైల్వేప్లాట్ఫారంపై గాంధీజీ దర్శనం కోసం 15 వేల మంది ప్రజలు గుమిగూడారు. వారిలో వేయిమంది స్త్రీలు కూడ ఉన్నారు. చలిగాలి, మంచుకురుసూన్నప్పటికి ప్రజలు రాత్రి 10-30 ని|లకు (Yeටඨිසී వచ్చేంత వరకూ ఓర్పుతో నిరీక్షించారు. విపరీతమైన జన సందోహం రావటంతో రైల్వేప్లాట్ ఫారం నిండిపోయింది. ప్లాట్ ఫారం వెలుపలవేలకొద్దీ జనం నిలబడవలసి వచ్చింది. 12 మంది ఒకొక్కరు రూ. 116/- చొప్పన గాంధీజీకి విరాళం సమర్పించారు. చిల్లరగా రూ.300/- వసూలైనాయి. చాల మంది స్త్రీలు బంగారు గాజులు, ఉంగరాలు, పట్టెడలు, ముక్కెరలను సమర్పించారు. ఒక మహిళ ఎనిమిది నవరసుల తూకంగల బంగారు గొలుసును సమర్పించింది. మొత్తం రూ.2,500/- నగదు, రూ.2,500/- విలువైన నగలు వసూలైనాయి. ప్రజలందరూ ఏవిధమయిన నినాదాలు చేయకుండా ప్రశాంతముగా కూర్చున్నారు. జిల్లా కాంగ్రెసు అధ్యక్ష కార్యదర్శులు మాగంటి బాపినీడు, సత్తిరాజు రామమూర్తి, డా|మూల్పూరి రంగయ్య, చుక్కమ్మ గార్లతో పాటు కాంగ్రెసు కార్యకర్తలు అనేకమంది గాంధీజీకి స్వాగతం చెప్పారు.

గాంధీజీ ప్లాట్ఫారానికి ఆవలనిలబడియున్న ప్రజలకు ముందుగా దర్శనమిచ్చి తరువాత తాను కూర్చున్న పెట్టె ద్వారానికి ముందు ఏర్పాటు చేసిన బల్ల పైకెక్కి తక్కిన వారందరికీ కనిపించారు. ప్లాట్ ఫారమునకు ఒక మూల గాంధీజీ దర్శనం కోసం ఆతృతపడుచుండిన జనము నుంచి కొంత సందడి వినపడగానే గాంధీజీ తన చేయి ఎత్తి నిశ్శబ్దముగా ఉండమని సైగ చేశారు. అంత సభలో ప్రశాంతత ఏర్పడింది. గాంధీజీ 15 నిమిషములు విరాళములను స్వీకరించారు. ఒక స్త్రీ తాను ఒడికిన నూలుతో గాంధీజీకి ఖాదీధోవతిని బహూకరించింది. గాంధీజీ మౌనవ్రతంలో ఉండుటచే ఆయన ఆంధ్రులకు ಇನ್ಫಿನಿ