పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/74

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గాంధీజీ ఆంధ్రదేశము నందు సంచారముగావించిన కాలములో ఆయన హృదయము రోజురోజుకూ ఆహ్లాదముతో నిండిపోయింది. ఏలూరునందు చేసిన ఉపన్యాసంలో ఆయన తన భావాలను వెల్లడించారు. ఏలూరునివాసియగు ముల్పూరు చుక్కమ్మ వేలూరు చెరసాల నుండి హరిజననిధికి బంగారు ఉంగరమును పంపిన విషయమును తెలియచేసూ ఇట్లన్నారు. "స్వార్థరహితమయిన ఇటువంటి భక్తి, సేవలను గాంచినప్పడు ఎవరి హృదయమున సంతోషము పొంగి పొరలదు? అంటరాని తనము త్వరలో నిర్మూలన కానున్నదనుటలో సందేహం లేదు. నేను ఎచ్చటకు వెళ్ళిననూ అచ్చట సవర్టులలో హృదయ పరివర్తన కనబడుతుంది. వారందరిలోనూ ఈ మహాసంస్కరణకు సుముఖత్వము కానవస్తూంది. ఎచ్చట చూచిననూ ప్రజలు రాగిపైసలు మొదలుగా బంగారు ఆభరణములు సైతము మనస్పూర్తిగా హరిజన నిధికి ఇస్తున్నారు. స్త్రీలు కూడ పురుషులకేమాత్రము వెనుకంజవేయుటలేదు. ఈ ఉద్యమ విషయమై ఆలోచించినకొలది మానవకోటి కంతటికిని సంబంధించిన ఉద్యమమనే అభిపాయము దృఢమగుతుంది. హిందువులమగు మనమే అస్పృశ్య పెనుభూతమును అంతము చేయాలి. హిందూ సంఘమునకు కళంకమును, విషతుల్యమగు దీనిని నిర్మూలించుటలో సఫలులమైన ఎడల వివిధ మతములకు సంబంధించిన భిన్నజాతులవారమైన భారతీయులందరమూగూడ నిజమైన సంతోషమును, సహకారమును, తృప్తిని, సంఫీుభావమును పొందగలమని నేను పరిపూర్ణముగ విశ్వసిసూన్నాను. ఎన్నికష్టములు ఎదురైనను మనముచేయుచున్న ఈ కృషి ఫలింప చేయవలెనని సర్వశక్తి మానుడగు భగవంతుని ప్రార్జించుచున్నాను. అనేక శతాబ్దముల నుండి మనమే, మనలో ఒక భాగమును అణగదొక్కియుంటిమని మరియొక పర్యాయము జ్ఞప్తికి తెచ్చుకొందము. అట్లుచేయుటవలన మనమే అధఃపతితులమైనాము. పరిశీలించిన కొలది ఈ అస్పృశ్యతను హిందూ సంఘమునుండి తొలగించనిచో హిందూ సంఘము సర్వనాశనమగుననే అభిప్రాయము బలమగుచున్నది. పవిత్రమగు వేదములు, ఉపనిషత్తులు, మహాభారతము మొదలగు పురాణముల ఉత్పష్టవాణి నుండి ఉద్భవించినదీ హిందూ మతము. అట్టి సర్వోత్తమమగు మతమేల నాశనము కానున్నది? వేదములు, ఉపనిషత్తులు, బోధించిన పరమాత్మయే సత్యము, మిగిలిన దంతయు మిథ్య అనే గొప్ప సిద్దాంతాన్ని మనం అంగీకరించకపోవుటవలననే పరమాత్మ సర్వసమానుడు, న్యాయమూర్తి అని అంగీకరిస్తూనే, మనలో ఉచ్చనీచ భావములకు తావిచ్చుచున్నాము. పై విషయములు గమనించిన కొలది ఒక్క హిందూ మతమునందేకాక ప్రపంచము నందు ఏ ఇతర మతమునందు కూడ అస్పృశ్యతకు తావుండదని తెలుస్తుంది. నేడు మతములన్నియూ కఠిన పరీక్షకు లోనగుచున్నాయి. ప్రతిమతమును తీవ్రముగ తర్మించబడుతుంది. అట్టి