పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/71

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

పెద్ద బహిరంగసభ ఏర్పాటు చేయబడింది. గాంధీ జీ అసీనులయ్యేటందుకు ఎతెన వేదిక ఏర్పాటుచేయబడింది. గాంధీజీ వేదిక దగ్గరకు వచ్చేసరికి గాంధీజీకి జై' అనే నినాదాలు మిన్నుముట్టాయి. హరిజనాభ్యదయానికి గాంధీజీ చే నూన్న కృషికి సొమ్ము ఈయడానికి తీర్మానించ కూడదని ప్రభుత్వము ఉత్తరు వులు చేసినట్లు తమ సన్మాన పత్రంలో తాలూకా బోర్డు వారు పేర్కొన్నారు. ఆ సన్మానపత్రాన్ని ప్రశిడెంటు సోమరాజు చిన్న వెండి వ బ్ళెంలో ఉంచి గాంధీజీకి సమర్పించారు. ఆ బైర్రాజు రామరాజు వెండి పళ్ళాన్ని వేలం వేయగా మహాత్మునికి తన ఇంట ఆతిథ్యమిచ్చిన | ఆయనే రూ.10/-కు కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు డా| తేతలి సత్యనారాయణ తాడేపల్లిగూడెం హరిజన నిధి వసూళ్ళ రూ.100/- కలిదిండి గంగరాజు తాడేపల్లిగూడెం తాలూకా హరిజన సంఘం వసూళ్ళ రూ.220/- పుట్టా సుబ్బారావు తాడేపల్లి గూడెం తాలూకా పంచాయితీల సంఘం వసూళ్ళ రూ. 65/- దామోజీపురపు లక్ష్మీ నరసమ్మ, హద్దనూరి సీతారామమ్మ స్త్రీ సమితి తరపున చేసిన వసూళ్ళు రూ.116/–, మొత్తం రూ. 510/- గాంధీజీకి సమర్పించారు. సభలో స్త్రీలు మహాత్మునిచేతికి సుమారు రూ.200/- విలువైన తమ ఆభరణ ములను సమర్పించారు.

సభ అనంతరం మహాత్ముడు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు బైర్రాజు రామరాజు గారి ఆహ్వానం మేరకు విశ్రాంతికై వారి ఇంటికి వెళ్ళారు. రామరాజు గారు గాంధీజీకి, ఆయన అనుచరగణమునకు, మిగిలిన జిల్లానాయకులకు అద్భుతమైన ఆతిధ్యాన్నిచ్చారు. రామరాజు గారు గాంధీజీకి సన్మాన పత్రాన్ని స్వయంగా అందచేశారు. రామరాజు గారి