పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/70

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

సత్యనారాయణశర్మ సహాయకార్యదర్శిగాను వ్యవహరించారు. భీమవరంలోని గాంధీ చౌక్ పేరున ప్రత్యేక స్థలాన్ని బహిరంగ సభకు నిర్ణయించారు. గాంధీజీ దర్శనము సర్వజనులకు కనబడురీతిగ ఎత్తైన వేదికపై ఉచితాసనమును ఏర్పరచారు. ఆ కుర్చీ నాలుగు వైపులకు తిరుగాడుటకు వీలుకలదిగా అమర్చబడింది. సుమారు 15 వేల మంది స్త్రీ పురుషులు సభకు హాజరైరి. యూనియన్ బోర్డు వారు, భీమవరం పంచాయితీ బోర్డు వారు గాంధీజీకి సన్మానపత్రములు సమర్పించారు. భీమవరం తాలూకా బోర్డు వారు సన్మానపత్రంతో సహా రూ.116/–లు సమర్పించారు. క్షత్రియస్త్రీలు తమఘాషా వదలి సభకు వచ్చి కానుకలు సమర్పించారు. ఈ సభలో స్త్రీల సంరంభము అధికంగా కనిపించింది. వడగళ్ళ వర్షమువలె వారు తమ ఆభరణములను, ప్రాంకులను, నవరసులను ఖద్దరు నిధికి సమర్పించారు. 10 భీమవరంనందు రూ.2000/- ధనరూపమున లభించింది. సభప్రశాంతముగా జరిగింది. ప్రజలు గాంధీజీ కారు రాకపోకలకు သဲဇ္ဇီ အရှေ့8ဉ္ဇ)ဝဓံ కలిగించలేదు. గాంధీజీ 15ని మాత్రమే సభయందు ఉన్నారు. దాట్ల చిననీలాద్రిరాజు 100 మంది హరిజన

పాలకొల్లులో జనకాశ్రమమునకు శంఖు స్థాపన చేయుట 1933

బాలబాలికలకు ఖద్దరు వస్త్రములను గాంధీజీచే సృశింపచేసి పంచిపెట్టారు. తనకు నీరసముగా ఉన్నది కావున సెలవు ఇవ్వవలసినదిగా భీమవరం ప్రజలను కోరి గాంధీజీ ఉ| 9.30 ని|లకు తాడేపల్లిగూడెంకు బయలుదేరినారు.11

తాడేపలిగూడెం

మహాత్ముడు 27వ తేదీ మధ్యహ్నం గం| 11 లకు తాడేపల్లిగూడెం చేరారు. అచ్చట