పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/62

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

4. deldēt 1933

1932 ఆగష్టు 17న బ్రిటిష్ ప్రధాని కమ్యూనల్ అవార్డ్ను ప్రకటిస్తూ హరిజనులు అల్పసంఖ్యాక వర్గం కనుక వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పరచుతున్నట్లు ప్రకటించాడు. ఆవిధంగా చేయటం దేశప్రజలలో విభజన, విభేదాలు సృష్టించటానికే అనే భావనతో సెప్టెంబరు 20 న గాంధీజీ అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. గాంధీజీని నిరాహార దీక్ష విరమింప చేయటానికి, హరిజనులను ఉమ్మడి నియోజకవర్గాల కనుగుణంగా మలచటానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. మరి ఒక వైపు ప్రభుత్వాధికారులు కమ్యూనల్ అవార్డ్కు అనుకూలంగా హరిజన ప్రతినిధులను కూడగట్టి సమావేశాలను నిర్వహించారు. గాంధీజీ దీక్షకు అనుగుణంగా ఆంధ్రాలో సానుభూతి నిరాహార దీక్షలు ప్రారంభమైనవి. అంటరానితనం పాటించబోమని పెక్కుమంది ప్రమాణాలు చేశారు. అందుకు అనుగుణంగా హరిజనుల్ని గ్రామానికి చెందిన బావులలో నీళ్ళతోడుకోనిచ్చారు.

తాడేపల్లిగూడెంలో దామోజీవరపు నరసింహరావు పంతులు, డా|తేతలి సత్యనారాయణ రావు హరిజన వాడలలో నూతులు తవ్వించి వారికి సహాయంచేశారు. హరిజనులకు దేవాలయములందు ప్రవేశం కల్పించటానికి చెరుకువాడ వెంకటనరసింహం, మాగంటి బాపినీడు, కన్నేపల్లి సత్యనారాయణ, మంగిపూడి పురుషోత్తమశర్మ జిల్లాలో ఎంతో కృషిగావించారు. దేశనాయకులు అంబేద్కర్ను సంప్రదించి, గాంధీజీతో రాయబారములు నిర్వహించి సెప్టెంబరు 24న ఒక ఒడంబడికకు రాగలిగారు. rveටඨිකී సెప్టెంబరు 26న నిరాహారదీక్షను ముగించారు. గాంధీజీ విజ్ఞప్తిని అనుసరించి, కాంగ్రెసు అధ్యక్షుడు మే 95 శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆరువారాలు నిలిపి ವೆನ್ತಿಲ್ಲ ప్రకటించాడు. తరువాత 1934, మే 20న శాసనోల్లంఘన ఉద్యమం పూర్తిగా ఉపసంహరించుకొనబడింది.

గాంధీజీ హరిజనోద్ధరణనిమిత్తము 1933 నవంబరు 8 నుండి 1934 జూలై చివరి వారం వరకూ అఖిలభారత హరిజన యాత్ర వివిధ రాష్ట్రములలో సాగించవలెనని సంకల్పించారు. అందు భాగముగా ఆంధ్రదేశ పర్యటన 1933 డిశంబరు 16 నుండి 29 వరకూ సాగినది. హరిజన యాత్ర ప్రారంభించటానికి ముందు గాంధీజీ ఈవిధంగా ప్రకటించారు. "నేను పుట్టుకవలన సవర్ణ హిందువుడనయినా నా బుద్ధిపూరకంగా హరిజనులలో కలిసిపోయినాను. హరిజనుని అస్పృశ్యునిగా భావిస్తూన్నంత వరకు నేనుకూడ అస్సృశ్యుడనే హరిజనునకు ప్రవేశంలేని దేవాలయంలో నాకు తావులేదు. హరిజనులకు నేను చేసే సేవ ఈశ్వర సేవయే అనుకొంటున్నాను. నేనీపనిని రాజకీయ