పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/53

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

పిలిచి తనకు సమర్పించిన ఫలములన్నింటిని వారికి పంచిపెట్టారు. రాత్రి గం19.30నిuలు కు గాంధీజీ విశ్రమించారు. చాగల్లు ఆశ్రమానికి గాంధీజీతో వచ్చిన ప్రముఖులలో మోతే నారాయణరావు, జిల్లా కాంగ్రెసు సంఘకార్యదర్శి කරඛථ కృష్ణమూర్తి, శనివారపు సుబ్బారావు, మంగిపూడి పురుషోత్తమ శర్మ కోడేటి వెంకటరాజు, డాక్టర్ యం. వి. కృష్ణారావు, ఆత్మకూరి గోవిందాచార్యులు ಹಿನಾಯಿ

. SošÓSóo

ఏప్రియల్ 28వ తేదీన మహాత్ముడు, ఆయన అనుచరవర్గము చాగల్లు છોડo૦° ఉదయం 4 గOIIలకు నిద్ర మేల్కొని ప్రాతఃకాలకృత్యాలు తీర్చుకొని ఉదయం గం:14, 30ని.లకు ఆశ్రమవాసులతోను, ఇతరులతోను కలిసి ప్రార్థన, భగవద్గీత పారాయణము జరిపి 5.30 ని|లకు బయలుదేరి 6 గం|లకు దేవరపల్లికి చేరారు. బయలుదేరుటకు ముందుగా పసల కృష్ణమూర్తిగారి భార్య తన శరీరము మీద మిగిలియున్న కంటెయు, బంగారపు గాజులును మహాత్మునకు సమర్పించారు. అచ్చట దేవరపల్లి హనుమంతరావు, దేవరపల్లి సుబ్బారాయుడు, దోనెపూడి లక్ష్మయ్య, అంబటి సత్యనారాయణ గారపాటి వెంకన్న మరియు పరిసర ప్రాంతవాసులు కలిసి రూ. 500/- ఖద్దరు నిధికి సమర్పించారు. కొవ్వూరు తాలూకా කි°තු అధ్యక్షుడు ముళ్ళపూడి రాయుడు గారి కుమారుడు తిమ్మరాజు కోరికపై గాంధీజీ దొమ్మేరు వెళ్ళారు. తిమ్మరాజు నాయకత్వమున యూనియనుబోరువారు సన్మానపత్రమును సమర్పించారు. తన స్వగృహమునందు తిమ్మరాజు రూ. 500/- ఖద్దరునిధికి సమర్పించారు.

గాంధీజీ సరిగా ఉదయం గం| 7.30 ని|లకు కొవ్వూరు చేరారు. శివుడు శివరావుగారి తల్లి మహాత్మునకు రూ.116/–లు, ఖద్దరుహారమును సమర్పించారు. 'లజపతినగర్లో స్వర్గీయ తల్లాప్రగడ సూర్యనారాయణరావు ఏర్పాటు చేసిన 'ఆంధ్ర ಗಿರಾಣ విద్యాలయ భవనము నందు బహిరంగసభ జరిగింది. తాలూకాబోరు అధ్యక్షుడు ముళ్ళపూడి తిమ్మరాజుగారు, యూనియనుబోర్డు అధ్యక్షుడు శివుడు శివరావు తమ బోర్డుల పక్షమున మహాత్మునకు సన్మానపత్రములను సమర్పించారు. కొవ్వూరు తాలూకా ప్రజలు, కొవ్వూరు సహకారసంఘము వారు గూడ సన్మాన పత్రములు సమర్పించారు. ఖద్దరునిధి రూ. 450/- చేకూరింది. శివుడు శివరావుగారు రూ. 300 /- లాలాజీ నిధికి సమర్పించారు. శివుడు శివరావు గారి కోర్మెపై ိလ္လဝ့်ထဲ లాలాలజపతిరాయ్ చేసిన దేశసేవకు