పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/52

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము చెరుకుమిల్లి దక్షిణామూర్తిశాస్త్రి మహాత్మునకు రూ.116/–లు చప్పన సమర్పించారు

చాగలు

గాంధీజీ నిడదవోలు నుండి బయలుదేరి వెళ్ళుచుండగా తాళ్ళూరిసూరన్న చాగంటి రాజయ్యగార్ల నాయకత్వములో చాగల్లు నందు మహాత్మునకు పౌరసన్మానము గావించారు. చాగల్లుప్రజలు రూ. 170/- లు, నేలటూరు గ్రామసులు రూ. 81/-లు ఖద్దరు నిధిసమర్పించారు. అక్కడ సంగ్రహముగా ఉపన్యసించి మూడు మైళ్ళ దూరానఉన్న 'ఆనందనికేతన్ ఆశ్రమానికి వెళ్ళారు. సహాయనిరాకరణ ఉద్యమకాలంలో ఏర్పరచబడిన ఈ ఆశ్రమానికి తల్లాప్రగడ ప్రకాశరాయుడు, తల్లా ప్రగడ నరసింహవర్మ ఆత్మవంటివారు. లక్కంసాని గంగరాజు ఈ ఆశ్రమానికి భూవసతిని సమకూర్చగా, ఆంధ్రపత్రిక అధిపతి ಡೆಕ್ದ್ದರs కాశీనాధుని నాగేశ్వరరావు అధిక ధనమును ఖర్చుచేసి భవనములను కట్టించారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా 'ఆనందనికేతన్"ను తీర్చిదిద్ది కార్యకర్తలు, నిమ్నజాతి విద్యార్ధులు కూడ ఆశ్రమంలోనే ఉంటున్నారు. గాంధీజీ వాహనము ఆశ్రమద్వారం వద్ద ఆగగానే, ఆశ్రమ విద్యార్ధులు, పరిసరగ్రామ ప్రజలు గాంధీజీకి స్వాగతమర్పించి, పూలమాలలువేశారు. గాంధీజీ, కారులోని వెనుక సీటుపై కూర్చుండి ఆశ్రమ విద్యార్ధులనుద్దేశించి మృదుమధురమైన ఉపన్యాసం ato)6).

గాంధీజీ ఆశ్రమంలోనికి వెళ్ళి స్నానాద్యనుషానాలు పూర్తికావించుకొని ఆశ్రమ భవనానికి ముందుండిన ఆవరణలో పిల్లల మధ్య కూర్చొని, వారిని తాను చేయబోయే దైవప్రార్థనలో పాల్గొనమని ఆదేశించారు. విద్యారులు, ఇతరులూ కూడ తదేక ధ్యాననిమగ్నులై ప్రశాంతముగా కూర్చున్నారు. ప్రకాశరాయుడు తన శిష్యవర్గంతో కలిసి ప్రార్ధన గీతం పాడారు. తదుపరి గాంధీజీకి పండ్లు సమర్పించారు. ప్రకాశరాయుడు గారి వృద్ధురాలైన తల్లిగారు రూ. 100/- లను తన గతించిన కుమార్తె యొక్క వెండిగిన్నెయును మహాత్మునకు సమర్పించారు. * ఇతర సమర్పణలు రూ. 122 /– ఖద్దరునిధికి వసూలైనాయి. అంతలో చిగురుపాటి భీమయ్య అనే హరిజన బాలుడు "మహాత్మా ఇది నేను స్వయంగా నేసిన జంపఖానా తాము స్వయంగా వాడుకోవలెను. ఎవ్వరికీ ఇవ్వరాదు." అని షరతు విధించి గాంధీజీకి సమర్పించాడు. గాంధీజీ “నేతప్ప ఎవ్వరూ వాడుకోరాదా, నేచనిపోయిన నాతోనే తగుల బెట్టవలెనా లేక మళ్ళీ నీకు కావలెనా" అని పరిహాస " మాడుతూ మహాప్రసాదమని కళ్ళకద్దుకున్నారు. గాంధీజీ ఆశ్రమములోనున్న పిల్లలను