పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/51

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

కనులకదు కొన్నారు. ఆ రోజున తణుకులోని అన్ని విధముల కూలీలు పనులను మానివేసిరి. తూర్పుకాపులు, సెట్టి బలిజలు, పంచములు మన్నగు నిరుపేదలు ఆరు పైసలు మొదలు రూపాయి వరకు తమ శక్తికొలది మహాత్మునికి సమర్పించారు. మహాత్ముని కారు సభారంగమున ఆగినపిదప పెన్మత్స లక్ష్మీపతిరాజుగారిచే రచించబడిన "గాంధీశతకము' గాంధీజీకి సమర్పించబడింది. గాంధీజీ చిరునవ్వుతో ఇంతకంటె ధనము ఇచ్చినచో సంతసించెదనన్నారు. దానిని అచ్చువేయించి అందు పైవచ్చు లాభమును ఖద్దరునిధికి ఈయవలసినది అని కవి కోరగా గాంధీజీ అంగీకరించెను.

గాంధీజీ 8గంIIలకు ఎర్రమిల్లి రామనాథముగారి మేడయందు విశ్రాంతికై ప్రవేశించారు. గాంధీజీని దర్శించుటకు వేలకొలది జనము రామనాథముగారి మేడబయట ఎండలో నిలుచున్నారు. గాంధీజీ రెండు పర్యాయములు ప్రజలకు దర్శనము ఇచ్చారు. 11గంuల తరువాత బయటకురాలేదు. అంతకంతకూ జనము అధికమైనారు ఎండవేడిమిచే ప్రజలు మిగుల ఇక్కట్లపడారు. సాయంత్రము గం|4.30ని.లకు విపరీతజనసమ్మర్ధము ”ნამბršćა. గాంధీజీ వారికి దర్శనము ఇచ్చి మరల లోనికేతెంచి, తన ఆంతరంగిక సభ జరిపారు. తరువాత తాడేపల్లిగూడెం, ఏలూరు, భీమవరం తాలూకా బోర్డుల ప్రెసిడెంట్ల వచ్చిన కార్యనిర్వాహక సభయందు తదుపరి కార్యక్రమమును నిర్ధారించుకున్నారు. తదుపరి ఐదు వేలమంది స్త్రీలు హాజరయిన సమావేశమునందు గాంధీజీ ఉపన్యసించారు. ఆ సభలో స్త్రీలు రూ. 172/- ఖద్దరు నిధికి సమర్పించారు. తణుకు నుండి సాయంత్రం గం| 5.30 ని|లకు గాంధీజీ కారు బయలుదేరుచుండగా కీ.శే. పానుగంటి అన్నాజీరావుగారి తల్లి రూ.50/- లు వెండి పళ్ళెరమునబోసికొని వచ్చి పళ్ళెరముతోసహా (Yeටඨිකීපී సమర్పించారు. జయజయధ్వానములతో తణుకు ప్రజలు గాంధీజీకి వీడ్కొలుపలికిరి. ఎర్రమిల్లి రామనాధముగారి ఇంటియందు అత్యంత ఉత్సాహముతో గాంధీజీ గడిపినారని నాయకులు ఆనందించారు. డిర్

నిడదవోలుకు పోయే మార్గమునందు బ్రాహ్మణగూడెంలో రూ.116/–లు ఖద్దరునిధి చేకూరింది. సమి(శిగూడెంనందు తణుకు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడు ෂීරාංඡ ဗဒ္ဓသံဝါသ္မီ) బ్రహ్మన్న ప్రముఖ వ్యాపారి కోట్ల నరసింహం మహాత్మునకు రూ. 116/–లు చొప్పన సమర్పించారు. నిడదవోలు నందు జరిగిన పెద్దసభలో అఖిలభారత తంతుకారక సంఘము, నిడదవోలు శాఖవారు, వర్తక సంఘమువారును, డాక్టరు బొమ్మకంటి రామమూర్తి,