పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/45

ఈ పుటను అచ్చుదిద్దలేదు

SSSSSSL SSSSSSSSSSSSSSSSSSS -పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

సభాసదుల నుద్దేశించి ఖద్దరు గూర్చి, అస్పృశ్యతను గూర్చి ఉపన్యసించారు. గాంధీజీ ఉపన్యాసమును దేశభక్త S°OCO వెంకటప్పయ్య అనువదించి చెప్పారు. ఈ సభకు మంగిపూడి పురుషోత్తమశర్మ, నిడదవోలు వెంకటరావు, పసల కృష్ణమూర్తి, ಮಾತ್ರೆ నారాయణరావు, ఆత్మకూరి గోవిందాచారి మున్నగు జిల్లా నాయకులు హాజరైనారు.17

తాడేపల్లిగూడెం నుండి ఉదయం 8గం|లకు గాంధీజీ అనుచరవర్గం చిలకంపాడు వెళ్ళి అచ్చట రూ.116/- ఖద్దరు నిధి స్వీకరించి, పిప్పర వెళ్ళారు. పిప్పరలో ఏర్పాట్ల సరిగాలేవు. ప్రజలు మహాత్ముని మోటారును ముట్టడించి ఇబ్బందికలిగించారు. ప్రజల అవధులులేని ప్రేమలో గాంధీజీ ఉక్కిరిబిక్కిరైనారు. గడచిన రాత్రి వరమపడుట వలన మార్గము నందు గాంధీజీ రాక తెలిసి మేఘములు నీళ్ళ చల్లినట్లు కనిపించింది. గాంధీజీ పిప్పర నుండి ఉండి గ్రామం బయలు దేరి వెళ్ళారు. మార్గములో గణపవO పరిసర గ్రామాలప్రజలు. రూ. 570/-, మందలపర్రు ప్రజలు రూ.116/–, పాందువ్వలైబ్రరీవారు రూ.50/-, గ్రామప్రజలు రూ.92/-, చెరుకుమిల్లి ప్రజలు రూ. 116/- ఖద్దరు నిధిని సమర్పించారు. සීටයි గ్రామములో రహదారి బంగళా ဝဲပ်င္ငံ సుమారు 8 వేల మందిని ఉద్దేశించి గాంధీజీ ప్రసంగిం చారు. ప్రజలు ఆనందోత్సాహములతో పరవశించారు. ఖద్దరు నిధికి రూ. 350/- సమర్పించారు. 18

ఆకివీడు\

ఉండి గ్రామము నుండి పలవర్తి లక్ష్మణస్వామి పట్టుదల వలన గాంధీజీ సాయంత్రము 5.30నిuలకు ఆకివీడు గ్రామం చేరారు. మూడు వేల మంది హాజరయిన సభలో గాంధీజీ ఉపన్యసించారు. ఖద్దరు ధారణ, విదేశీ వస్త్ర బహిష్కరణ, నూలు వడకుట, హిందూ మహ్మదీయ ఐక్యత, మద్యనిషేధము, అస్పృశ్యతను రూపుమాపట మొదలగు విషయములపై బోధన సాగింది. స్త్రీ పురుషులు శ్రద్ధతో ఉపన్యాసమును ఆలకించారు.పులవర్తి లక్ష్మణస్వామి సన్మానపత్రముతో పాటు రూ. 1116/- ఇవ్వగా మిగిలిన వారు శక్తికొలది ధనమును, ఆభరణములను ఖద్దరు నిధికి సమర్పించారు. జయ జయధ్వానముల మధ్య సాయంత్రం 6. 303) గాంధీజీ ఆకివీడు నుండి భీమవరం బయలుదేరారు. గాంధీజీని తమ గ్రామమునకు తీసుకొని వచ్చినందుకు పులవర్తి లక్ష్మణస్వామి గారిని ఆకివీడు ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. "