పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/37

ఈ పుటను అచ్చుదిద్దలేదు

SLSLSCSLSLMLSSLSLSSLSLS -పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

కూడ కొందరు భాగ్యవంతులు ఉన్నారు. వారు కూడ సుఖముగనే ఉన్నారు. పండితమదనమోహనమాలవ్య గారి పాఠశాలలో ఒక పంచమబాలుడు నాతో “దేవాలయములో ఒక బల్లకట్టియున్నది. దానిపై ಏ೦ಏಮಿಲು, మహ్మదీయులు, క్రైస్తవులు రాకూడదు అనియున్నది." అని అన్నాడు. " ఎవరైతే ఈ బల్ల కట్టియున్నారో వారిని రాకూడదని ఆమహానుభావుడు పరమేశ్వరుడు లిఖించియున్నాడు. ఆయన ఏమి చెప్పచున్నాడనగా ఎవరైనా ఒకరిని అంటరానివానిగా భావించిరో ఆహృదయములో నేను

పలూరునందు బహిరంగ సభ, 1929

ఉండను. కనుక దేవాలయధర్మకర్తలతో ఒక విషయము చెప్పచున్నాను. ఇప్పడే, నేడే ఆబోర్డులను తీసివేయవలెను, కొందరు పంచములు చెప్పిరట మేము ఆ మందిరములకు పోము, కాని అట్టి బల్లకట్టినవారు మాపై దోషారోపణము చేయుచూ బల్ల కట్టినందుచేత సిగ్గుపడుచున్నాము. కనుక అట్టి అవమానకరమైన బల్లలను తీసివేయవలెను. కల్లుసారాయి త్రాగువారు, మతుపదార్ధములు ఉపయోగించువారు తమ దురభ్యాసములను మానివేయవలెను. ఇది కాంగ్రెసు యొక్క శాసనము. దానిని అమలుచేయవలసియున్నది." అని పేర్కొన్నారు. సభనందే గాంధీజీ ఏలూరు తాలూకా ඪ*තු నుండి రూ. 1,116/– పశ్చిమ గోదావరి జిల్లా బోర్డు నుండి రూ.116/- ఏలూరు పౌరులనుండి రూ. 8,000/- ఏలూరు తాలూకా విద్యార్థి సంఘం నుండి రూ. 191/- ఖద్దరు నిధికి విరాళాలు స్వీకరించారు. రాజామంత్రిప్రగడ భుజంగరావు గాంధీజీకి నూలు కండెలు సమర్పించారు.