పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/22

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

ప్రతి స్త్రీ మనమాతయే అని భావించకుండా మన కామశాంతికై కొందరిని ఈ నీచవృత్తికి ప్రత్యేకించి, వారి జీవితాలను ఆధోగతి పాల్చేసూన్నాము. మన సహాయనిరాకరణ ఉద్యమము అతిపవిత్రమైనది. అందు ఇటువంటి ధర్మవిరుద్దపుకార్యములకు తావులేదు. అసత్యమునకు, హింసకు ఇందుతావులేదు. కనుక ప్రస్తుత ప్రభుత్వమును సైతాను ప్రభుత్వము అని మనము అంటున్నాము. ప్రస్తుత రాజ్యపాలనను రావణరాజ్యంతో పోలుస్తున్నాము. అటువంటి మనము భోగపస్త్రీలనే ఒకజాతిని నిలిపి ఉంచటం ఎంతో విచారకరము. ఆంధ్రనాయకులందరూ ఈ అపచారాన్ని అంతంచేయటానికి నడుము కట్టాలి. స్త్రీ సమాజాభివృద్ధికి పాటుపడే సేవకురాండ్రందరూ ముందంజ వేయాలి. వారు ఇంటింటికీ తిరిగి ఈ అపవిత్రవృత్తిని విసర్జించేటట్లు చేయాలి. ఆవిధంగా చేసి మీ ఆంధ్ర దేశములో 'భోగపుస్త్రీ కులవ్యవస్థ అదృశ్యమైనదని నాకు తెలిపితే నేను ఎంతో సంతోషిస్తాను.” 2

"సోదరులారా ! మనకార్మికుల దుస్థితికి నేను అనేక సంవత్సరములు, అనేక ప్రయత్నములు కావించి చివరకు రాట్నమే అన్ని సమస్యలకు పరిష్కారమనే నమ్మకమునకు వచ్చాను. మనరాట్నములు ఎప్పడు మూలన పడినవో అప్పడే మన భాగ్యదేవత అంతరించింది. అందుచే మీరందరూ రాట్నములను పునరుద్ధరించవలెనని కోరుతున్నాను. రాట్నముమన ఆర్థికపరిస్థితిని ఉద్ధరించుటయేకాక, స్వరాజ్య సంపాదనకు కూడా ముఖ్యసూత్రమని నా అభిప్రాయము.

మనము స్వరాజ్యము ఆరునెలలలో రావలెనని కోరుతున్నాము. అందుకు అఖిలభారతకాంగ్రెసు సంఘమువారు మూడు విషయములను నిర్ణయించారు. అవి. 1. జూన్ 3వ తేదీలోగా కోటి రూపాయలు 'తిలక్ స్వరాజ్యనిధి'కి సేకరించుట, 2. కోటిమందిని కాంగ్రెస్ &&%Seלחכג చేర్పించుట, 3. ప్రతియింటా రాట్నము తిరిగేటట్లు చేయుట, కనీసం దేశములో 20 లక్షల రాట్నములైనా ఏర్పరచుట.

ఈ మూడు విషయములను ఈ రెండు మాసములలోగా పూర్తిగా మీరు నెరవేర్చవలసియుంది. మీరు ఒక్క గజం విదేశీవస్తాన్ని ధరించినా మహాపాతకం చేసిన వారగుదురు. మీ ప్రాంతములో తయారుచేయబడుతున్న నూలు చాల ప్రశస్తముగా ఉంది. ఇక్కడ తయారుచేయుచున్న వస్త్రములు మిక్కిలి కోమలముగా ఉన్నాయి. ఇట్టివస్తాలు

ෙ23 ම