పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది
పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము



1. పరిచయము - తొలి ప్రయోగాలు

భారత స్వాతంత్ర్యోద్యమం నందు గాంధీజీ ప్రవేశంతో ఉద్యమ స్వరూపమే మూరి పోయింది. కుటిలరాజకీయాలతో కాకుండా నైతిక పరమైన నిబద్ధతతో జీవితాన్ని గడిపి జనబాహుళ్యంలో ప్రేమను పొందవచ్చని గాంధీజీ నిరూపించారు. అనైతికత విశృంఖల నృత్యం చేస్తున్న కాలంలో ఉన్నతమైన మానవసంబంధాల స్థాపన కోసం నిలచిన మహోన్నత మూర్తి ఆయన. కొన్ని తరాలు గడిచాక ఈ భూప్రపంచం మీద ఇంతటి ఉన్నతమైన వ్యక్తి ఒకరు జీవించారా అని జనం ఆశ్చర్యం చెందుతారు. గాంధీజీ 1869 అక్టోబరు, 2న కథియవాడ్ సంస్థానములోని పోరుబందరునందు జన్మించారు. 1891లో ఇంగ్లాండు నందు బారిష్టర్ అయ్యారు. 1893లో దక్షిణ ఆఫ్రికాకువెళ్ళి రెండు దశాబ్దములు పైగా నివసించారు. అక్కడ శ్వేతజాతి ప్రభుత్వం వలస వచ్చిన ప్రజలపై సాగిస్పూన్న జాత్యహంకార, జాతివిచక్షణ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం నడిపారు. అహింసాయుత 'సత్యాగ్రహం సాగించి, అనేక సార్లు జైళ్ళకువెళ్ళి అవమానములకు గురియైనారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అణచివేత విధానాలకు ప్రపంచమంతా నిరసనలు తెలియచేసేటట్టు చేయగలిగారు. చివరకు 1914 జూన్ 27న 'ఇండియన్ రిలీఫ్ బిల్"ను ప్రభుత్వం ఆమోదించి. ఆఫ్రికాలోని భారతీయులకు ఊరట కలిగించినది. గాంధీజీ కనిపెట్టిన "కొత్త పద్ధతి సత్యాగ్రహం మంచిఫలితాలనిచ్చింది. సత్యం-అహింస దీని ముఖ్య ప్రక్రియలు. దీనిని "ఆత్మశక్తి లేక ప్రేమశక్తి అని ఆయన నిర్వచించారు. సత్యాగ్రహి ఏది తప్ప అని భావిస్తాడో, దానికి లొంగటానికి నిరాకరిస్తాడు. ఎంత రెచ్చగొట్టినా శాంతి యుతంగానే చెడును ప్రతిఘటిస్తాడు, కాని చెడు చేసేవాడిని ద్వేషించడు. ప్రత్యర్థికి కష్టం కలిగించటం ద్వారా కాక, తను కష్టపడుతూ సత్యాన్ని చాటుతాడు. దాని ద్వారా చెడు చేసేవాని హృదయం పరివర్తన చెందుతుందని ఆయన ఆశించారు. విజయం సాధించాలంటే సత్యాగ్రహి భయాన్ని ద్వేషాన్ని, అసత్యాన్ని పూర్తిగా త్యజించాలి. 'సహాయనిరాకరణ బలహీనుల ఆయుధయైతే, సత్యాగ్రహం బలవంతుని ఆయుధం అని గాంధీజీ అన్నారు.

గాందిీ దక్షిణ ఆఫ్రికా నుండి 1915-16లలో భారత దేశమునకు తిరిగి వచ్చారు. తన రాజకీయ గురువుగా భావించిన గోపాలకృష్ణ గోఖలే సలహాననుసరించి దేశమంతా సందర్శించారు. వివిధ వర్గాలవారి సమస్యలను అవగాహన కావించుకొన్నారు. సత్యాగ్రహం దక్షిణ ఆఫ్రికాలో విజయవంతమైనప్పడు భారతదేశంలో ఎందుకు ప్రయత్నించకూడదు అని ప్రశ్నించుకొన్నారు. "బ్రిటీషు ప్రభుత్వం శక్తివంతమైన ప్రభుత్వ మనడంలో నాకు ఎటువంటి సందేహములేదు. అదే విధంగా సత్యాగ్రహం సర్వసంజీవని అనటంలో కూడా నాకు ఎటువంటి సందేహము లేదు" అని అన్నారు. బీహారులోని చంపారన్ నీలిమందు

17