పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది

కృతజ్ఞతలు

జాతిపిత మహాత్మాగాంధీ పై గల భక్తి భావముతో ఈ గ్రంథము వ్రాయటానికి సాహసించాను. ఆయన జీవితము ఒక మహాసాగరం, అది ఎనో ఆటుపోటులకు గురియై స్వాతంత్ర్కమనే కల్ల వృక్షాన్ని భారతజాతికి అందించింది.గంధిీజీ నాయకత్వంలో స్వాతంత్ర్యపోరాటం అనే మహాయజ్ఞంలో ఎనో కుటుంబాలు సమిధలైపోయాయి. ఆ మహామహులు చేసిన త్యాగాలను మనం అను నిత్యం స్మరించుకుంటూ ఉంటే గాని స్వాతంత్ర్యం యొక్క విలువ తెలియదు. గాంధీజీ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ప్రజాస్త్రందన, వారు చేసిన త్యాగాలు జ్ఞప్తికి తెచ్చి ఈనాటి యువతకు, విద్యార్థులకు సూర్తి కలిగించటమే ఈ గ్రంథం యొక్కప్రధాన ఆశయం.

ఈ గ్రంథములో అధికభాగం ప్రాధమిక ఆధారాలను అనుసరించి వ్రాయుట జరిగింది. వాస్తవాలను ప్రతిబింబింప చేయటానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచాను. చరిత్ర పరిశోధనా విద్యార్శలకు ఉపయుక్తమగురీతిగ ఆధారములను సవివరముగా పేర్కొనటం జరిగింది. కీ.శే.పద్మభూషణ ఆచార మామిడిపూడి వెంకటరంగయ్య గారి భారత స్వాతంత్ర్యోద్యమంపై వివిధ రచనలు, కొడాలి ఆంజనేయులుగారి 'ఆంధ్రప్రదేశ్లో గాంధీజీ, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి కాంగ్రెస్ చరిత్ర ఈ రచనా గమనాన్ని నిర్దేశిస్తూ ముందుకు నడిపించినవి. వారికి నా కృతజ్ఞతలు. “ఆంధ్రపత్రిక", "కృష్ణాపత్రిక", "సత్యాగ్రహి" వంటి సమకాలీన పత్రికలు పదిలపరచి సమాచార సేకరణకు సహాయపడిన రాష్ట్ర రాజ్య అభిలేఖా నిలయమువారికి ధన్యవాదములు.

దయతో ఈ గ్రంథానికి " పరిచయ వాక్యం "వ్రాసి ఇచ్చిన ఆచార్య