ఈ పుట ఆమోదించబడ్డది

78

ఒక యోగి ఆత్మకథ

మంచి వాగ్ధార గల ఆ సాధువుకు నేను, భక్తి పురస్సరంగా వీడ్కోలు చెబుతూ ఉండగా, భవిష్యద్దర్శనం ఒకటి వెల్లడించా డాయన:

“ఈవేళ నువ్విక్కణ్ణించి వెళ్ళిన తరవాత, నీకు అసామాన్యమైన అనుభవం ఒకటి కలుగుతుంది.”

నేను దేవాలయ ఆవరణనుంచి బయటికి వచ్చి, తరవాత ఎక్కడికి వెళ్ళాలో నిశ్చయించుకోకుండా తిరుగుతున్నాను. వీధి మలుపు తిరుగుతూ ఒక పాత స్నేహితుడికి ఎదురు పడ్డాను – వాడు ఎల్లాటివాడంటే, అల్లాటి వాళ్ళ సంభాషణ శక్తులు కాలాన్ని ఖాతరు చేయకుండా అనంతంగా సాగుతూనే ఉంటాయి.

“నిన్ను తొందరగా విడిచి పెడతాలే,” అంటూ నాకు మాట ఇచ్చాడు వాడు, “మనం విడిపోయినప్పటి నించి ఇప్పటి దాకా ఇన్నేళ్ళూ జరిగిన సంగతులన్నీ చెప్పేటట్టయితే!” అన్నాడు.

“ఎంత విపరీతం! నే నిప్పుడు వెళ్ళిపోవాలి.”

కాని వాడు నా చెయ్యి పట్టేసుకుని, కొన్ని సంగతులు టూకీగా, నా చేత బలవంతాన చెప్పిస్తున్నాడు. ఆవురావురుమంటున్న తోడేలులాగున్నాడు వీడు, అనిపించింది సరదాగా. నేను ఎక్కువసేపు మాట్లాడిన కొద్దీ, వాడు ఇంకా చెప్పమంటూ పీకుతున్నాడు. వీణ్ణి నేను మర్యాదగా తప్పించుకొనే ఉపాయం చెయ్యమని, మనస్సులో కాళికాదేవికి మనవి చేసుకున్నాను.

మా స్నేహితుడు చటుక్కున వెళ్ళిపోయాడు. అమ్మయ్య, అనుకుని నేను నడక మరింత జోరుచేశాను, ఈ వదరుబోతు పీడ మళ్ళీ తిరగబెడుతుందేమో నన్న భయంతో, వెనకాల తొందరగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించి నా వేగాన్ని పెంచాను. వెనక్కి తిరిగి చూడ్డానికి