ఈ పుట ఆమోదించబడ్డది

"గంధబాబా" అద్భుతాల ప్రదర్శన

73

వంగదేశపు విఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త అయిన జగదీశ్ చంద్ర బోస్‌నూ కలుసుకొన్నాను.

నేను “గంధబాబా” గారిని కలుసుకోడానికి భూమికలుగా చెప్పదగ్గ అంశాలు రెండున్నాయి. వాటిలో ఒకటి మధురమైనదీ మరొకటి వినోదకరమైనదీ.

“దేవుడు సరళమైనవాడు. తక్కినదంతా జటిలమైనది. ప్రకృతి తాలూకు సాపేక్ష ప్రపంచంలో నిరపేక్షమైన విలువలకోసం వెతక్కు.”

“నేను కాళికాదేవి[1] ఆలయంలో విగ్రహానికి ఎదురుగా మౌనంగా నిలబడి ఉన్నప్పుడు, ఈ దార్శనిక నిష్కర్షలు మృదువుగా నా చెవిని పడ్డాయి. తిరిగి చూసేసరికి, ఒక పొడుగాటాయన కనిపించాడు; ఆయన ధరించిన - లేదా ధరించని - వస్త్రాన్ని బట్టి ఆయన ఒక సంచార సాధువని తెలిసింది.

“మీరు, నా ఆలోచనల్లో ఉన్న వ్యాకులతను నిజంగా కనిపెట్టారు!” అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వు నవ్వాను. కాళికాదేవిలో సంకేతితమైన మాదిరిగా, ప్రకృతిలోని కృపా-భయానక రూపాల జటిలత నా కంటె తెలివైన బుర్రలనే తబ్బిబ్బు చేసింది.”

“ఈమె మర్మాన్ని విప్పి చెప్పగలవాళ్ళు బహు కొద్దిమంది!

  1. కాళికాదేవి, ప్రకృతిలోని శాశ్వత నియమానికి ప్రతీక. సాంప్రదాయికంగా ఈమెను, నేలమీద పడుక్కొని ఉన్న శివదేవుని- లేదా అనంతుని. రూపం మీద నిలబడి ఉన్న చతుర్భుజ మూర్తిగా చిత్రిస్తారు. ఎందుచేతనంటే, ప్రకృతి-అంటే దృగ్విషయక ప్రపంచం- కార్యకలాపాలు నిర్గుణ బ్రహ్మనుంచి ఉత్పన్నమవుతాయి. ఈమె నాలుగు చేతులూ నాలుగు మౌళిక లక్షణాలకు ప్రతీకలు: వాటిలో రెండు శుభంకరమైనవి, రెండు వినాశకరమైనవి; ద్రవ్యానికి అంటే సృష్టికి- మౌలికమైన ద్వంద్వం.