ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 5

“గంధబాబా”

అద్భుతాల ప్రదర్శన

“ఈ లోకంలో ప్రతిదానికీ ఒక ఋతువన్నది ఉంది. ఉద్దిష్టమైన ప్రతిదానికీ ఒక సమయమంటూ ఉంది.”[1]

సాలమన్ రాజు[2]కున్న ఈ జ్ఞానం, నన్ను నేను ఓదార్చుకోడానికి, నాకు లేదు. నేను ఇంట్లోంచి వచ్చేసి ఇప్పుడు ఏ విహారయాత్రకు వెళ్ళినా, నా కోసం విధి నిర్ణయించి పెట్టిన గురుదేవుల ముఖం ఎక్కడయినా కనిపిస్తుందేమోనని పట్టిపట్టి పరిశీలనగా చూసేవాణ్ణి. అయినప్పటికీ నా హైస్కూలు చదువు పూర్తి అయేవరకు ఆయన దగ్గరికి నాకు దారి ఏర్పడలేదు.

అమర్‌తో బాటు నేను హిమాలయాలకి పారిపోవడానికి శ్రీయుక్తేశ్వర్‌గారు నా జీవితంలోకి ప్రవేశించిన సుదినానికి మధ్య రెండేళ్ళు గడిచాయి. ఈ నడిమి కాలంలో నేను కొందరు సాధువుల్నీ- “గంధబాబా”, “టైగర్ స్వామి”, సగేంద్రనాథ్ భాదురీ, మాస్టర్ మహాశయుల్నీ-

  1. ‘ఎక్లిసియాస్టిస్..’ : : 1 (బైబిలు, కింగ్ జేమ్స్ పాఠం).
  2. క్రీ. పూ. పదోశతాబ్దిలో ఇజ్రాయిల్ దేశాన్ని పాలించిన వీర ప్రభువు. పరిపాలనలో అతడు చూపిన వివేకాన్నిబట్టి, ధర్మాన్నిబట్టి ఈనాటికీ అతడి పేరు జ్ఞాని అనే మాటకు పర్యాయపదంగా ప్రసిద్ధిచెందింది.