ఈ పుట ఆమోదించబడ్డది

70

ఒక యోగి ఆత్మకథ

“ఒక్క వారంలో అది జరిగింది. రాము మొట్టమొదటిసారిగా ప్రకృతిమాత సుందరముఖాన్ని దర్శించాడు. మునులందరి కన్న మిన్నగా అతను ఆరాధించే రాముడి నామాన్నే పురశ్చరణ చెయ్యవలసిందిగా సర్వజ్ఞులైన గురువుగారు తమ శిష్యుడికి సూచించారు. రాము విశ్వాసమన్నది భక్తితో దున్నిన నేల; అందులో గురువుగారి, శక్తిమంతమూ, శాశ్వతమూ అయిన రోగనివారణ బీజం మొలకెత్తింది.” అంటూ కేవలానందగారు ఒక్క క్షణంపాటు మౌనం వహించారు; తమ గురువుగారి మహిమను మళ్ళీ ప్రస్తుతించారు.

“లాహిరీ మహాశయులు చేసిన అద్భుతచర్య లన్నిటిలోనూ స్పష్టమయే విషయం ఏమిటంటే, తానే వాటికి కారకశక్తి ననుకొనే అవకాశం అహంకారానికి [1]ఎన్నడూ ఇయ్యకపోవడం. లాహిరీ మహాశయులు, చికిత్సాకారకమైన మూలశక్తికి తమను తాము అర్పించుకొన్నవారు; అందువల్లే ఆయన, ఆ శక్తిని స్వేచ్ఛగా తమగుండా ప్రసరించేటట్టు చేశారు.

  1. ఈ అహంకారం (అంటే, “నేను చేస్తున్నాననే భావన”) అన్నది ద్వంద్వానికి లేదా, మనిషికీ అతన్ని సృష్టించినవాడికీ మధ్య గోచరించే వేరుపాటుకు, మూలకారణం. ఈ అహంకారం మానవుల్ని మాయలో పడేస్తుంది; దానివల్ల కర్తే (అహం) ‘కర్మ’గా మిథ్యారూపంలో కనిపిస్తాడు. ఒకరు సృష్టిస్తే ఏర్పడ్డవాళ్ళు తామే సృష్టికర్తలమని ఊహించుకుంటారు.

    “నైవ కించి త్కరో మీతి యుక్తో మన్యేత తత్త్వవిత్,
    పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్ర న్నశ్న న్గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ..

    ప్రపలన్ విసృజన్ గృహ్ణ న్నున్మిష న్నిమిషన్నపి,
    ఇంద్రియా ణీంద్రియార్దేషు వర్తంత ఇతి ధారయన్.

    సత్యాలన్నిటిలోకి పరమమైన సత్యాన్ని నమ్మినవాడు, “నా అంతట నేనేమీ చెయ్యడం లేదు,” అనుకొంటాడు; “ఇంద్రియాలలో ఇంద్రియాధీనమైన ప్రపంచం చేస్తున్నదే ఇదంతా,” అని నమ్ముతాడు .

    గీత, అధ్యా. 5 : 3-9

    ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః
    యః పశ్యతి తథా౽త్మాన మకర్తారం సపశ్యతి

    నిజానికతడు, అంతటా జరిగేవి ప్రకృతి అలవాటు ప్రకారం జరిగేవని, ప్రతినిధిగా కాక, ఆచరణ ద్వారా ఆత్మ అభ్యాసం కోసం ఉద్దేశించినవనీ గమనిస్తాడు .

    అధ్యా. 13 : 10

    అజో౽పి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో౽పి సన్
    ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవా మ్యాత్మ మాయయా.

    నేను పుట్టుక లేనివాణ్ణి చావులేనివాణ్ణి నాశరహితుణ్ణి సర్వజీవులకూ అధిపతినీ అయినప్పటికీ మూల విస్తృతిలో తేలి ఆడే ప్రకృతి రూపాలమీద నేను ముద్రించిన మాయవల్లా, నా ఇంద్రజాలంవల్లా నేను వస్తూ పోతూ ఉంటాను.

    అధ్యా. 4 : 6

    దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
    మా మేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే.

    నన్ను మరుగుపరుస్తూ, వివిధ లీలలు ప్రదర్శించే దివ్యమైన తెరను ఛేదించుకొని పోవడం కష్టసాధ్యం; అయినా నన్ను కొలిచేవాళ్ళు దాన్ని ఛేదించుకొని ముందుకు పోగలుగుతారు.

    అధ్యా. 7 : 14