ఈ పుట ఆమోదించబడ్డది

68

ఒక యోగి ఆత్మకథ

చిన సాధనాల్లో, అన్నిటికంటె పటిష్ఠమైనది క్రియాయోగమేనని భావిస్తాను,” అంటూ గంభీరమైన ప్రమాణ వాక్యంతో ముగించారు కేవలానందగారు. “మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న దేవుడు, క్రియాయోగ పద్ధతిని వినియోగించడం వల్ల లాహిరీ మహాశయుల భౌతిక శరీరంలోనూ, ఆయన శిష్యుల్లో కొందరిలోనూ, మనకు కళ్ళకు కట్టే విధంగా రూపుదాల్చాడు.”

కేవలానందగారు గురువుగారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఒకసారి లాహిరీ మహాశయులు చేసిన దివ్యమైన అద్భుతం ఒకటి ఉంది. ఋషితుల్యులైన మా మాస్టరుగారు ఒకనాడు నా కా కథ మళ్ళీ చెప్పారు. ఆయన కళ్ళు, మా కెదురుగా బల్లమీదున్న సంస్కృత పుస్తకాలకు దూరంగా లగ్నమయి ఉన్నాయి.

“గురువుగారి శిష్యుల్లో రాము అనే గుడ్డివాడి మీద నాకు జాలి కలిగింది. అతనికోసం ఏమయినా చెయ్యాలనిపించింది. తమలోనే పరమాత్ముడు ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న మా గురువుగారికి ఇతడు ఎంతో విశ్వాసపాత్రుడయి సేవ చేస్తున్నాడే, అటువంటి ఇతని కళ్ళలోనే వెలుగు లేకపోవాలా, అనిపించింది. ఒక రోజున రాముతో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. కాని అతడు, చేత్తో చేసిన ఒక తాటేకు విసనికర్రతో, గంటల తరబడి ఓపికగా, గురువుగారికి విసురుతూ కూర్చున్నాడు. చివరి కతడు గదిలోంచి బయటికి వెళ్ళిన తరవాత నేనూ వెనకాలే వెళ్ళాను.

“రామూ, నీకు కళ్ళుపోయి ఎంతకాలమయింది?”

“నేను పుట్టినప్పుడేనండి! ఒక్క క్షణమయినా సూర్యుణ్ణి చూసే అదృష్టం నా కళ్ళకి పట్టలేదండి,” అన్నాడు.

“సర్వశక్తి సంపన్నులయిన గురువుగారు నీకు సాయం చెయ్య గలరు. ఒకసారి ఆయనకి మనవి చెయ్యి,” అన్నాను.