ఈ పుట ఆమోదించబడ్డది

848

ఒక యోగి ఆత్మకథ

లేదా అస్పష్టదైవం అగాధాల్లోంచి వెలువరిచినటువంటిది) ఆయన ఉనికిని ప్రకటించాడు” (రూపొందించాడు, లేదా సాక్షాత్కరింపజేశాడు).[1]

“నిజంగా, నిజంగా చెబుతున్నాను మీకు,” అంటూ వివరించాడు ఏసుక్రీస్తు, “తండ్రి చేస్తుండగా చూస్తున్నది తప్ప కొడుకు తనంతట తాను ఏమీ చెయ్యలేడు; ఆయన చేసేది ఏదయినాసరే కొడుకు కూడా చేస్తాడు (కనక).”[2]

దృగ్విషయిక లోకాల్లో దేవుడు తనంతట తానుగా ప్రదర్శించే త్రిగుణాత్మక ప్రకృతిని హిందూ పవిత్ర గ్రంథాల్లో ప్రతీకాత్మకంగా చెప్పడం జరిగింది- సృష్టికర్తగా బ్రహ్మ, స్థితికారకుడుగా విష్ణువు, లయకారకుడుగా శివుడు. ఈ మూర్తిత్రయం కార్యకలాపాలు స్పందనశీల సృష్టి అంతటా అనంతంగా ప్రకటితమవుతూనే ఉన్నాయి. కేవల పరబ్రహ్మ మానవుడి మనోగోచర శక్తులకు అతీతమైంది కనక, నైష్ఠిక హిందువు ఆయన్ని త్రిమూర్తుల పావనరూపాల్లో ఆరాధిస్తాడు.[3]

అయితే భగవంతుడి విశ్వ సృష్టి - స్థితి - లయ కారక స్వరూపం ఆయన పరమావస్థ కాని, కనీసం ఆయన మూలప్రకృతికాని కాదు (ఎంచే

  1. యోహాను 1: 18.
  2. యోహాను 5 : 19 (బై బిలు).
  3. ‘సత్, తత్, ఓం’ లేదా, పిత, పుత్రుడు, పరిశద్ధాత్మ అనే త్రయరూప సత్యానికి భిన్నమైన భావన ఇది. బ్రహ్మ - విష్ణు - శివులు పరమేశ్వరుడి త్రయభావాన్ని, స్పందనశీలమైన సృష్టిలో అంతర్నిహితమైన ఉన్న కూటస్థ చైతన్యమనే ‘తత్’ను లేదా, పుత్రుణ్ణి సూచిస్తారు. త్రిమూర్తుల “భార్యలు”గా చెప్పే ‘శక్తులు’, స్పందన ద్వారా విశ్వాన్ని నిలిపే ఏకైక మూలకారణ శక్తి అయిన ‘ఓం’కారానికి లేదా, పరిశద్ధాత్మకు సంకేతాలు.