ఈ పుట ఆమోదించబడ్డది

1940 - 1951 మధ్యకాలం

847

దృశ్య జగత్తులో కార్యకారణ నియమంచేత బద్ధుడైన మానవుడిలో ఉన్న వివేకశక్తి, ఆద్యంతరహితుడూ కారణరహితుడూ అయిన దేవుడి చిక్కుముడిని చూసి గాభరాపడుతుంది. మానవుడి వివేకం సృష్టి రహస్యాల్ని భేదించలేకపోయినప్పటికీ భగవంతుడే భక్తుడికోసం, ప్రతి రహస్యాన్నీ చివరికి వెల్లడి చేస్తాడు.”

జ్ఞానంకోసం చిత్తశుద్ధితో తపన చెందేవాడు, దైవపథకంలోని ఓనమాలు కొన్ని సవినయంగా సాధనచేస్తూ అన్వేషణ ప్రారంభిస్తాడు; అంతేకాని జీవితంలోని “ఐన్‌స్టైన్ సిద్ధాంతం” తాలూకు సునిశిత గణిత రేఖాచిత్రం తనకు కావాలని ముందే కోరడు.

“మానవుడెవడూ (అంటే, కాలం అనే మాయ[1]కు సంబంధించిన సాపేక్షతలు గల మర్త్యుడెవడూ), ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు; పరమపిత హృదయస్థానంలో ఉన్న ఏకైక ఔరసపుత్రుడు (అంటే, ఓంకార స్పందన ద్వారా భౌతిక దృగ్విషయాల్ని అన్నిటినీ నడిపించే ప్రతిబింబిత కూటస్థ చైతన్యం, లేదా బహిర్ముఖంగా ప్రక్షేపించిన పూర్ణసిద్ధ జ్ఞానం, ఏకత్వ వైవిధ్యాన్ని వ్యక్తీకరించడానికి ‘హృదయస్థానం’ నుంచి

  1. వెలుగులోంచి చీకటిలోకి మళ్ళీ చీకటిలోంచి వెలుగులోకి సాగుతుండే ప్రపంచ దివారాత్ర చక్రం, సృష్టిమాయతో లేదా పరస్పర విరుద్ధ స్థితులతో ముడిపడి ఉన్నదన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటుంది. (రోజులో సంధికాలాలైన సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్ని, ధ్యానానికి, శుభప్రదమైనవని, అందుకే భావిస్తారు). యోగి ఈ ద్వంద్వరూపాత్మక ఆవరణాన్ని ఛేదించుకొని అతీంద్రియ ఏకత్వాన్ని దర్శిస్తారు.