ఈ పుట ఆమోదించబడ్డది

846

ఒక యోగి ఆత్మకథ

బోధించడానికి, ఎన్సినిటాస్‌లోనూ లాస్ ఏంజిలస్‌లోనూ తరగతులు నిర్వహించాను.

“దేవుడసలు ఆత్మనూ శరీరాన్నీ ఎందుకు కలపాలి?” అంటూ ఒకనాడు సాయంత్రం, తరగతిలో ఒక విద్యార్థి అడిగాడు. “సృష్టి అనే పరిణామశీలమైన నాటకానికి నాంది పలకడంలో ఆయన ఉద్దేశించిన ప్రయోజనం ఏమిటి?” అనేకమంది ఇతరులు కూడా అలాటి ప్రశ్నలు వేశారు; వాటికి పూర్తిగా సమాధానాలు చెప్పడానికి తత్త్వవేత్తలు ప్రయత్నించి విఫలులయారు.

“కొన్ని రహస్యాల్ని అనంతకాలంలో ఛేదించడానికి వదిలి పెట్టు,” అంటూండేవారు శ్రీయుక్తేశ్వర్‌గారు, చిరునవ్వు నవ్వుతూ. “మానవుడి పరిమిత తార్కికశక్తులు, ఎవరివల్లా సృష్టికాని (స్వయంభువు) కేవల పరబ్రహ్మకు గల అనూహ్యమైన ఉద్దేశాల్ని ఎలా అవగాహన చేసుకో గలుగుతాయి?[1]

  1. “నా ఆలోచనలు నీ ఆలోచనలు కావు, నీ మార్గాలు నా మార్గాలు కావు, అన్నాడు ప్రభువు. భూమికన్న ఆకాశం ఎత్తులో ఉన్నట్టే, నా మార్గాలు నీ మార్గాలకన్న ఉన్నతమైనవి, అలాగే నీ ఆలోచనల కన్న నా ఆలోచనలూను.” యెషయా 35 : 8–9. ‘ది డివైన్ కామెడీ'లో డాంటీ ఇలా ధ్రువపరిచాడు.

    “ఆయన కాంతితో ప్రకాశమానమైన
     ఆ స్వర్గంలో నేను ఉండివచ్చాను, అక్కడ నేను చూసినవి చెప్పాలంటే
     తిరిగి వచ్చినవాడికి, దానికి నేర్పూ లేదు, ఎరుకా లేదు;
     చిరకాంక్షాతప్తుడైనవాడికి అది చేరువవుతున్నప్పుడు
     మన బుద్ధి ఎంత గాఢంగా ఆనందమగ్నమవుతుందంటే,
     తాను వచ్చిన దారిని అది మళ్ళీ పట్టుకోలేదు.
     అయినా, ఆ దివ్యరాజ్యాన్ని గురించిన జ్ఞానమేదైనా
     భద్రపరచుకోడానికి, జ్ఞాపకశక్తిలో ఉన్నంతవరకు
     ఈ పాట ముగిసేవరకు నా గానానికి విషయమవుతుంది.”