ఈ పుట ఆమోదించబడ్డది

1940 - 1951 మధ్యకాలం

827

విశాల సాగరసీమలూ, పర్వతదృశ్యాలతో ఎన్సినిటాస్‌లో ఉన్న ఆలయం, వాటినన్నిటిని మించి, ఆ ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావ సంపన్నులైన స్త్రీపురుషుల సౌభ్రాత్రం- ఏకత్వ భావనలో లీనులై, సృజనాత్మక కృషిలో నిమగ్నులై, దైవచింతనలో పరిపూర్ణులైన జనాన్ని - నేను ఒక కలలో మాదిరిగా చూస్తున్నాను... వేకువకోసం వాచ్‌టవర్ మీద కాసుకొని ఉండి ఈ ఉత్తరం రాస్తున్న ఒక సామాన్య సైనికుడు, సత్సంగ సభ్యులందరికీ శుభాకాంక్షలు పంపుచున్నాడు.”

ఎస్. ఆర్. ఎఫ్. కార్యకర్తలు, కాలిఫోర్నియా హాలీవుడ్ లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్ రెలిజియన్స్ (సర్వధర్మ సమన్వయ ఆరాధన మందిరం) ఒకటి నిర్మించి 1942 లో ప్రారంభోత్సవం జరిపారు. తరవాత మరో ఏడాదికి, కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోలో ఒకటి, 1947 లో లాంగ్ బీచ్‌లో ఒకటి ఎస్. ఆర్. ఎఫ్. ఆలయాలు స్థాపించడం జరిగింది.[1]

ప్రపంచంలో అందమైన ప్రదేశాల్లో ఒకటయిన లాస్ ఏంజిలస్‌లోని పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో, పుష్పాకీర్ణమైన అద్భుతలోకం ఒకటి, 1949లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కు ప్రదానం చెయ్యడం జరిగింది. పన్నెండెకరాల ఆ స్థలం, పచ్చవన్నె కొండలు చుట్టిఉన్న సహజమైన నాట్యరంగస్థలంలా ఉంది. పర్వతశిఖరం మీద నీలకాంతమణి మాదిరిగా ఉన్న విశాలమైన సహజ సరోవరం ఒకటి ఉండడంవల్ల, ఆ సంస్థానానికి ఎస్. ఆర్. ఎఫ్. సరోవరాలయం (లేక్ ష్రైన్) అన్న పేరు వచ్చింది. అక్కడ చిత్రమైన డచ్చి గాలిమరల ఇంట్లో ప్రశాంతమైన

  1. లాంగ్ బీచ్ ప్రార్థనాలయం 1967 నాటికి బాగా పెరిగింది. ఆ సంవత్సరంలో ప్రార్థన సమావేశం, కాలిఫోర్నియాలోని పుల్లర్‌టన్‌లో ఏర్పాటయిన విశాలమైన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆలయానికి మారింది. (ప్రచురణకర్త గమనిక).