ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం

65

గురించీ లాహిరీ మహాశయుల గురించీ మాట్లాడే అవకాశం కోసమే ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. ఒక రోజున మా మాస్టరుగారు, నా కోరిక మన్నించి లాహిరీ మహాశయుల సన్నిధిలో తాము గడిపిన జీవితానికి సంబంఛించిన విషయం ఒకటి చెప్పారు.

“అరుదైన అదృష్టం వల్ల, లాహిరీ మహాశయులకు సమీపంలో పదేళ్ళపాటు ఉండే అవకాశం నాకు కలిగింది. రోజూ రాత్రిపూట నా యాత్రకు గమ్యస్థానం, కాశీలో వారి నివాసగృహం. గురువుగారెప్పుడూ మేడమీద మొదటి అంతస్తులో, ముందరున్న చిన్న గదిలో ఉంటూండే వారు. ఆయన ఒక కొయ్యబల్ల మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉండేవారు. ఆ బల్లకి వెనకాల, చేర్ల బడ్డానికి ఒక చెక్క కూడా లేదు. ఎదురుగా ఆయన శిష్యులు, పుష్పమాలాలంకారం మాదిరిగా అర్ధచంద్రాకారంగా కూర్చొనేవారు. ఆయన కళ్ళు బ్రహ్మానందంతో మిలమిలా మెరుస్తూ కదులుతుండేవి. అవి ఎప్పుడూ, దూరదర్శన శక్తిగల అంతశ్చక్షువు ద్వారా శాశ్వతానంద గోళంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ, సగం మూసుకొని ఉండేవి. ఆయన ఏకబిగిని మాట్లాడటమన్నది అరుదు. ఆయన చూపు, సందర్భానుసారంగా, తమ సహాయం అవసరమున్న ఒక శిష్యుడి మీద కేంద్రీకరించి ఉండేది , అప్పుడు హిమపాతంలా వచ్చిపడే కాంతిని పోలిన ఉపశమన వాక్కులు ధారగా వెలువడుతుండేవి.

“ఆ మహాపురుషుల చూపుతో నాలో, వర్ణించడానికి శక్యం కాని ఒకానొక ఆనందం వెల్లివిరుస్తుండేది. అనంతత్వమనే ఒకానొక మహాపద్మంలోంచి వెలువడ్డ మాదిరిగా, ఆయనలోంచి వచ్చే సుగంధం నాలో నిండిపోయేది. మేము రోజుల తరబడి మాట్లాడుకోకపోయినప్పటికి, ఆయన సన్నిధిలో ఉండడమే, నా అస్తిత్వాన్నంతనూ మార్చేసిన మహత్తరమైన అనుభవం. కంటికి సోకని అడ్డంకి ఏదయినా నా ఏకాగ్ర