ఈ పుట ఆమోదించబడ్డది

822

ఒక యోగి ఆత్మకథ

పడవ, ఒంటిగా ఎగురుతూ పోతున్న ఒక సముద్ర పక్షి. “క్రీస్తూ నువ్వు పునరుత్థానం చెందావు!” వాసంత రవిబింబంతో మాత్రమే కాదు, పరమేశ్వరుడి శాశ్వతోషస్సుతో.

అనేక మాసాలు ఆనందంగా గడిచిపోయాయి. పరిపూర్ణ సౌందర్యా కీర్ణమైన ఎన్సినిటాస్‌లో, చాలాకాలం కిందట నేను పథకం వేసుకున్న, ‘కాస్మిక్ ఛాంట్స్’ (విశ్వగీతాలు) రచన పూర్తిచేశాను. భారతీయ గీతాలు చాలావాటికి ఆంగ్లపదాలూ, పాశ్చాత్య స్వరసంకేతాలూ సమకూర్చాను. వాటిలో కొన్ని: శంకరాచార్యులవారి “నిర్వాణ షట్కం” (నో బర్త్ నో డెత్); పురాతన సంస్కృత మంత్రం “బ్రహ్మానందం పరమసుఖదం” (హిమ్ టు బ్రహ్మ); టాగూరు రాసిన “మందిరే మమ కే ఆసిత్న ఛే?” (హూ ఈజ్ ఇన్ మై టెంపుల్!); ఇవి కాక నేను సొంతంగా కూర్చిన పాటలు కొన్ని: “ఐ విల్ బి దైన్ ఆల్వేస్” (నే నెప్పుడూ నీ వాడిగా ఉంటాను), “ఇన్ ది లాండ్ బియాండ్ మై డ్రీమ్స్” (నా కలల కావలి లోకంలో), “కం ఔట్ ఆఫ్ ది సైలెంట్ స్కై” (మౌన గగనం నుంచి వెలుపలికి రా), “లిసెన్ టు మై సోల్ కాల్” (నా ఆత్మ పిలుపును అలకించు), “ఇన్ ది టెంపుల్ ఆఫ్ సైలెన్స్” (శాంతి మందిరంలో). [1]

ప్రాచ్యదేశాల కీర్తనలకు పాశ్చాత్యుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో వివరిస్తూ నా మొట్టమొదటి ప్రముఖ అనుభవాన్ని ఉల్లేఖిస్తూ ఆ పాటల పుస్తకానికి తొలిపలుకు రాశాను. సందర్భం ఒక బహిరంగోప

  1. “కాస్మిక్ ఛాంట్స్” లో ఉన్న చాలా పాటలకు పరమహంస యోగానందగారు రికార్డింగులు ఇచ్చారు. ఈ రికార్డులు, లాస్ ఏంజిలస్‌లో ఉన్న ఎస్. ఆర్. ఎఫ్. లో దొరుకుతాయి. (ప్రచురణకర్త గమనిక ).