ఈ పుట ఆమోదించబడ్డది

820

ఒక యోగి ఆత్మకథ

ప్రశాంతమైన ఈ పాశ్చాత్యదేశపు ఆశ్రమంమీద వారు ఆశీస్సులు కురిపిస్తున్నట్టు అనిపించింది నాకు.

ఆ హాలుకు సూటిగా కింద, కొండ ముందుభాగంలోనే అనంతమైన ఆకాశానికీ సముద్రానికీ ఎదురుగా ధ్యానగుహలు రెండు నిర్మించి ఉన్నాయి. మైదానాల్లో ఎండ కాచుకునే ప్రదేశాలు, నాపరాయి పరిచిన దారులు, ప్రశాంతమైన పొదరిండ్ల కూ గులాబీతోటలకూ ఒక యూకలిప్టస్ తోటకూ, కొన్ని ఎకరాల మేర విస్తరించిన పండ్లతోటకూ వెళ్తాయి.

సాధువుల ఉత్తమ, వీరోచితాత్మలు ఇక్కడికి వచ్చుగాక! (ఆశ్రమ ద్వారాల్లో ఒకదానిమీద వేలాడదీసిన, “నివాసంకోసం ఒక విన్నపం”లో ఇలా ఉంది; ఇది ‘జెంద్ - అవెస్తా’ లోంచి ఎంపిక చేసినది); వారు మాతో చెయ్యీ చెయ్యీ కలిపి సాగుతూ, భూమిలా సమృద్ధమై, ఆకాశంలా ఉదాత్తమైన తమ శుభాశీస్సులు మాకు అందిస్తూ ఉందురు గాక!

కాలిఫోర్నియాలో ఎన్సినిటాస్‌లో ఉన్న పెద్ద ఎస్టేటు, శ్రీ జేమ్స్ జి. లిన్, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కు ఇచ్చిన కానుక. శ్రీ లిన్ 1932 జనవరిలో దీక్ష తీసుకున్నప్పటినించి నిష్ఠగా సాధన చేస్తూ వస్తున్న క్రియాయోగి. (విస్తృతంగా చమురు వ్యాపారం చేసే సంస్థకు అధిపతిగా, ప్రపంచమంతటిలోకి బృహత్తరమైన అన్యోన్య అగ్నిభీమా వినిమయ సంస్థకు అధ్యక్షుడుగా) అంతులేని బాధ్యతలుగల అమెరికా వ్యాపారస్తుడు శ్రీ లిన్; అయినప్పటికీ ఈయన, ప్రతిరోజూ చాలా సేపు గాఢంగా కియాయోగ ధ్యానం చెయ్యడానికి వీలు చేసుకుంటారు. అటువంటి సంతులిత జీవితం గడుపుతూ ఈయన, అచంచల ప్రశాంతిని ప్రసాదించే సమాధిస్థితిని అందుకొన్నారు.

నేను భారతదేశంలోనూ యూరప్‌లోనూ ఉన్న కాలంలో (జూన్