ఈ పుట ఆమోదించబడ్డది

812

ఒక యోగి ఆత్మకథ

లాస్ ఏంజిలస్‌లో ప్రతిఏటా సంవత్సరాంతం సెలవుల్లో ఉత్సవాలు జరుపుతారు. డిసెంబరు 24 (ఆధ్యాత్మిక క్రిస్మస్)[1] నాడు వరసగా ఎనిమిది గంటలపాటు సామూహిక ధ్యానం జరుగుతుంది. ఆ మర్నాడు విందు (సామాజిక క్రిస్మస్). ఈ ముగ్గురు ప్రపంచ యాత్రికులకూ పునరాగమన సందర్భంగా స్వాగతం చెప్పడానికి దూరదూరాల్లో ఉన్న నగరాల్నించి ప్రియమిత్రులూ విద్యార్థులూ రావడంవల్ల ఈ సంవత్సరం ఉత్సవాలు ఇతోధికంగా జరిగాయి.

క్రిస్మస్‌నాటి విందులో, ఆ శుభసందర్భం కోసం పదిహేను వేల మైళ్ళ నుంచి తెచ్చిన నాజూకు వస్తువులు ఎన్నో ఉన్నాయి: కాశ్మీరు నుంచి గుచ్చీ పుట్టగొడుగులు, డబ్బాల్లో పెట్టిన రసగుల్లాలు, మామిడి తాండ్ర, అప్పడాలు, ఐస్‌క్రీం గుబాళింపుకోసం వెయ్యడానికి తెచ్చిన తెచ్చిన కేవడా పూలనూనె. ఆనాటి సాయంత్రం మేము, కళ్ళు మిరుమిట్లు గొలిపే పెద్ద క్రిస్మస్ చెట్టు చుట్టూ చేరాం; దానికి దగ్గరిలోనే సుగంధం వెదజల్లే సైప్రస్ కొయ్యదుంగలతో మండుతున్న నిప్పుగూడు ఉంది.

ఇక కానుకలందించే సమయం! నేల నాలుగు చెరగులనుంచీ

  1. డిసెంబరు 23 న రోజుంతా ధ్యానం చేసే పద్ధతి 1950 నుంచి అమలులో ఉంది. ఈ విధంగా ప్రపంచమంతటా ఉన్న సభ్యులు ఈ ప్రత్యేక దినాన తమ ఇళ్ళలోనూ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాల్లోనూ ఆలయాల్లోనూ క్రిస్మస్ పండుగ చేసుకోడమే కాకుండా, ప్రధాన కార్యాలయంలో ధ్యానానికి సమావేశమయిన భక్తులతో ఏర్పడే ఆధ్యాత్మిక అనుసంధానంవల్ల గొప్ప ఆధ్యాత్మిక ఉపకారం, ఆశీస్సులు పొందుతున్నారు. ఏదైనా ఒక ప్రత్యేక సమస్య పరిష్కరించుకోవాలని కాని, తొలగించుకోవాలని కాని కోరేవాళ్ళకోసం ప్రతి రోజూ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కేంద్రంతోనూ ప్రార్థన మండలితోనూ అనుసంధానం ఏర్పరుచుకున్నవాళ్ళు ఏ సమయంలోనయినా సరే, అదే మాదిరి దివ్యోద్ధరణ లాభం పొందవచ్చు. (ప్రచురణకర్త గమనిక).