ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 47

పడమటికి నా తిరుగు ప్రయాణం

“నేను భారతదేశంలోనూ అమెరికాలోనూ యోగశాస్త్ర పాఠాలు చాలా చెప్పాను; కాని ఒక హిందువుగా, ఇంగ్లీషు విద్యార్థులకు క్లాసులు నడుపుతున్నందుకు అపూర్వమైన ఆనందం కలుగుతోందని చెప్పాలి.”

నా లండన్ క్లాసు విద్యార్థులు ప్రశంసాసూచకంగా నవ్వారు; రాజకీయ సంక్షోభాలేవీ మా యోగశాంతిని భంగపరచలేదు.

భారతదేశం ఇప్పుడు పవిత్ర స్మృతి మాత్రమే అయింది. అది 1936 లో సెప్టెంబరు నెల; లండన్‌లో ఉపన్యాసమిస్తానని పదహారు నెలల కిందట ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికని ఇప్పుడు నేను లండన్ వచ్చాను.

ఇంగ్లండు కూడా, అమరమైన యోగ సందేశాన్ని అందుకోవాలన్న ఉత్సుకతతో ఉంది. పత్రికావిలేఖరులూ న్యూస్ రీల్ కెమెరామెన్, గ్రాన్‌వెనార్ హౌస్‌లో నా బసకు వచ్చి ముసిరేశారు. వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిల్స్ తాలూకు బ్రిటిష్ జాతీయ మండలివాళ్ళు, వైట్‌ఫీల్డ్ కాంగ్రిగేషన్ చర్చిలో సెప్టెంబరు 29 న ఒక సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో నేను, “మైత్రీభావం మీద విశ్వాసం నాగరికతను ఎలా రక్షిస్తుంది?” అన్న బరువైన విషయం మీద మాట్లాడాను. కాక్స్‌టన్ హాలులో రాత్రి 8 గంటలకు జరిగిన ఉపన్యాసాలు శ్రోతల్ని ఎంత అధిక సంఖ్యలో ఆకర్షించాయంటే, వాళ్ళలో బయట మిగిలిపోయినవాళ్ళు,