ఈ పుట ఆమోదించబడ్డది

నిరాహార యోగిని

809

పడింది. రయ్యిన దూసుకువచ్చే మిణుగురు పురుగులూ, గుడిసెల్లో దూరాన ఉన్న చమురులాంతర్లూ, ఆ కారునల్లని రాత్రివేళ అందంగా ప్రకాశించాయి. ఇక , బాధాకరమైన వీడుకోలు సమయం; మందకొడిగా, విసుగెత్తించేలా సాగే ప్రయాణం ముందుంది మాకు.

“గిరిబాలగారూ, మీ జ్ఞాపకార్థం నాకు ఏదైనా ఇయ్యండి - మీ చీరల్లోది, ఒక చిన్న పేలిక,” అని అడిగాను, ఆ సాధ్వి కళ్ళు విప్పుతూ ఉండగా.

వెంటనే ఆవిడ, ఒక బనారసు పట్టుబట్ట ముక్క ఒకటి తీసుకువచ్చి ఇచ్చి, సాష్టాంగ ప్రణామం చేశారు.

“అమ్మా,” అంటూ గౌరవ పురస్సరంగా అన్నాను, “మీ బదులు నన్నే మీ పవిత్ర పాదాల్ని ముట్టుకోనియ్యండి!”