ఈ పుట ఆమోదించబడ్డది

నిరాహార యోగిని

805

వశ్యంతో నేను లేచి, నవాబ్‌గంజ్ గంగాఘట్టం బయలుదేరాను. దారిలో, మా అత్తవారింటి పురోహితులు తారసపడ్డారు.”

“ ‘మహాశయా, నేను తిండి తినకుండా బతకడం ఎలాగో చెప్పండి,’ అని, ఆయన్నే నమ్ముకొని అడిగాను.”

“ఆయన జవాబు చెప్పకుండా, నావేపు తేరిపార చూశారు. చివరికి ఓదార్పు ధోరణిలో మాట్లాడారు. ‘అమ్మాయ్, ఈ రోజు సాయంత్రం గుడికి రా; నీ కోసం ప్రత్యేకమైన వైదిక విధి ఒకటి జరుపుతాను.’ ”

“ఈ అస్పష్టమైన సమాధానం కాదు నేను ఆశించింది; ముందుకు సాగి, ఏటి రేవుకు వెళ్ళాను. ప్రాతఃకాల సూర్యకిరణాలు నీళ్ళలోకి దూసుకుపోతున్నాయి; ఏదో పవిత్ర దీక్ష తీసుకోడాని కన్నట్టు, గంగలో స్నానం చేసి పునీతురాల్ని అయాను. చుట్టుకున్న తడిబట్టతో గంగ ఒడ్డు నుంచి వస్తూంటే, ఆ పట్టపగటి వెలుతురులో, నా గురుదేవులు నాకు ఎదురుగా ప్రత్యక్షమయారు.”

“ ‘చిట్టితల్లి,’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. ‘నీ అత్యవసర ప్రార్థన మన్నించి, నీ కోరిక నెరవేర్చడానికి దేవుడు ఇక్కడికి పంపిన గురువును నేను. చాలా అసాధారణమైన ఆ ప్రార్థనకు ఆయన గుండె కరిగిపోయింది! ఈనాటి నించి నువ్వు సూక్ష్మకాంతివల్ల జీవిస్తావు, నీ శరీరాణువులు అనంతవాహినితో పునర్నవం చెందుతూంటాయి.’ ”

గిరిబాలగారు మౌనం వహించారు. నేను, శ్రీరైట్ పెన్సిలూ పుస్తకమూ తీసుకుని, అతనికి తెలియడానికి కొన్ని సంగతులు ఇంగ్లీషులోకి అనువాదం చేశాను.

ఆ సాధ్వి కథ కొనసాగించారు. ఆవిడ మధురస్వరం, వినిపించీ వినిపించనట్టుగా ఉంది. “రేవు నిర్మానుష్యంగా ఉంది. నా గురుదేవులు