ఈ పుట ఆమోదించబడ్డది

804

ఒక యోగి ఆత్మకథ

అత్తవారింట్లో కొత్తవాళ్ళ మధ్య ఉండే సమయం వచ్చినప్పుడు, నువ్వు తిండి తినడం తప్ప మరేమీ చెయ్యకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? అంటూ హెచ్చరిస్తూ ఉండేది తరచు, మా అమ్మ.”

“ఆవిడ ఊహించిన ప్రమాదం రానే వచ్చింది. నేను నవాబ్ గంజ్‌లో మా అత్తవారింటికి వెళ్ళేసరికి నా వయస్సు పన్నెండేళ్ళే. నా తిండిపోతు అలవాట్ల గురించి మా అత్తగారు, పొద్దున, మధ్యాహ్నం, రాత్రికూడా నన్ను అవమానిస్తూనే ఉండేవారు. అయితే, ఆవిడ తిట్లు నాకు దీవెనలయాయి; నాలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రవృత్తులు ఒక్కసారి మేలుకున్నాయి. ఒకనాడు పొద్దున ఆవిడ చేసిన హేళన చాలా నిర్దాక్షిణ్యంగా ఉంది.”

“ ‘నేను బతికున్నంత కాలం, మళ్ళీ ఇక అన్నం ముట్టనని మీకు నిరూపిస్తాను,’ అని చటుక్కున బదులిచ్చాను.”

“మా అత్తగారు వెటకారంగా నవ్వారు. ‘అలాగా!’ అన్నా రావిడ. ‘మితిమించకుండా తిని బతకలేనిదానివి అసలే తినకుండా ఎలా బతుకుతావే?’ ”

“ఈ వ్యాఖ్యానం, జవాబు చెప్పడానికి వీలయినది కాదు. అయినా నా హృదయంలో ఒక వజ్రనిర్ణయం జరిగింది. ఒక ఏకాంతస్థలంలో కూర్చుని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాను.”

“పరమేశ్వరా, తిండివల్లకాకుండా నీ వెలుగువల్ల బతకడం ఎలాగో నాకు నేర్పే గురువు నొకరిని నాకు ప్రసాదించు.” అంటూ ఎడతెరిపి లేకుండా మొరపెట్టుకున్నాను.

“ఒకానొక దివ్యానందం నన్ను ఆవేశించింది, ఆ ఆనందపార