ఈ పుట ఆమోదించబడ్డది

నిరాహార యోగిని

803

చిన్న మెదడు ద్వారా మీ శరీరాన్ని పునర్నవం చేసే విశ్వకాంతివల్లా పుష్టి కలుగుతోంది మీకు.”

“బాబాకు తెలుసు,” అంటూ మళ్ళీ ఒప్పుకున్నా రావిడ, ఆవిడ తీరు సౌమ్యంగా, సరళంగా ఉంది.

“అమ్మా, బాల్యజీవితం గురించి చెప్పండి. భారతదేశానికంతకూ ఆ మాటకు వస్తే - సముద్రాల అవతల ఉన్న మన సోదర సోదరీమణులకు కూడా గాఢమైన ఆసక్తి కలిగిస్తుంది.”

గిరిబాలగారు స్వాభావిక గాంభీర్యాన్ని పక్కకి పెట్టి కులాసాగా సంభాషణ సాగించారు.

“అలాగే,” ఆవిడ స్వరం మెల్లగా, దృఢంగా ఉంది. “నేను ఈ అడవి ప్రాంతంలో పుట్టాను. అలవికాని ఆకలి ఉండడం తప్ప నా బాల్యంలో చెప్పుకోవలసింది ఏదీ లేదు.”

“తొమ్మిదేళ్ళ వయస్సప్పుడు నాకు పెళ్ళి నిశ్చయమయింది.”

“అమ్మాయ్, నీ వాపిరిగొట్టుతనాన్ని అదుపులో పెట్టుకోవే!”