ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

779

జీవితంలో నటనే ఎరగని గాంధీగారు ఆ మరణ సమయంలో మహానటులయారు. ఆయన నిస్స్వార్థ జీవితంలోని త్యాగాలన్నీ కలిసి, ప్రేమపూర్వకమైన ఆ చివరి భంగిమను చూపించగలిగాయి.

ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ మహాత్ములకు జోహార్లు అర్పిస్తూ ఇలా అన్నాడు. “ఇటువంటి వ్యక్తి ఒకడు రక్తమాంసాలతో ఈ భూమిమీద నడిచాడన్న సంగతి నమ్మలేని తరాలు కూడా రావచ్చు.” రోమ్‌లో వాటికన్ నుంచి వచ్చిన సమాచారంలో ఇలా ఉంది: “ఆ హత్య ఇక్కడ మాకు ఎంతో సంతాపం కలిగించింది. క్రైస్తవ సద్గుణాలు మూర్తీ భవించిన దేవదూతవంటి గాంధీగారి కోసం ప్రజలు విలపిస్తారు.”

ఒక విశిష్ట సత్కార్యాన్ని సాధించడానికి భూమి మీదికి వచ్చిన మహాపురుషులందరి జీవితాలూ ఏదో ఒక ప్రతీకాత్మకమైన అర్థంతో ముడిపడి ఉంటాయి. భారత సమైక్యంకోసం నాటకీయంగా సంభవించిన గాంధీగారి మరణం ప్రతి ఖండంలోనూ అనైక్యంతో చీలికలై పోయిన ప్రపంచానికి ఆయన సందేశాన్ని ప్రముఖంగా చాటి చెప్పింది. ఆ సందేశాన్ని ఆయన భవిష్యత్తును సూచించే ఒక ప్రవక్త మోస్తరుగా ఇలా వెల్లడించారు:

“అహింస జనబాహుళ్యంలోకి వచ్చింది; అది జీవిస్తుంది. అది ప్రపంచానికి. శాంతిదూత.”