ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

771

మనుషులు కంటబడడంతో గాఢంగా చలించిపోయి, తమ తుపాకులు కిందపారేసి పారిపోవడం జరిగింది.

“నా దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికి రక్తపాతం కావించే మార్గాల్ని అనుసరించడం కంటె, అవసరమయితే కొన్ని యుగాలయినా కాసుకొని ఉంటాను.” బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “కత్తి పట్టిన వాళ్ళందరూ కత్తికే ఎర అవుతారు,”[1] అని. మహాత్ములు ఇలా రాశారు:

“నేను జాతీయవాదీనని చెప్పుకొంటాను; కాని నా జాతీయవాదం విశ్వమంత విశాలమయినది. భూమిమీదున్న దేశాలన్నింటినీ తన ఒడిలోకి తీసుకుంటుందది.[2] నా జాతీయతావాదంలో సర్వప్రపంచ సంక్షేమమూ ఇమిడి ఉంది. నా భారతదేశం, ఇతర దేశాల బూడిదగుట్టలలోంచి పైకి లేవాలని కోరను నేను. భారతదేశం ఏ ఒక్క మనిషినీ దోచుకోవాలని కోరను. భారతదేశం తన బలంతో ఇతర దేశాల్ని కూడా శక్తిమంతం చెయ్యగలగడానికి అది బలిష్ఠంగా ఉండాలని కోరతాను. ఈనాడు యూరప్‌లో ఒక్క దేశమయినా అలా లేదు; అవి ఇతర దేశాలకు బలం చేకూర్చవు.

“ప్రెసిడెంట్ విల్సన్ పధ్నాలుగు చక్కని అంశాలు రూపొందించి, వాటిని పేర్కొన్నాడు కాని, “ఇంతా చేసి, శాంతి సాధించడానికి మనం చేసే ప్రయత్నం విఫలమయిందంటే, మళ్ళీ చేబట్టడానికి మనకి ఆయు

  1. మత్తయి 26 : 52. బైబిలులో మానవుడి పునర్జన్మను గర్భితంగా సూచించిన అసంఖ్యాకమైన సందర్భాల్లో ఇది ఒకటి. జీవితంలోని జటిలతల్లో చాలావరకు, కర్మసంబంధమైన న్యాయ సూత్రాల్ని అవగాహన చేసుకోడంవల్లనే అవగాహన అవుతాయవి.
  2. మనిషికి తన దేశాన్ని ప్రేమించడంలో ఘనత ఉందనుకోగూడదు, తన జాతిని ప్రేమించడంలో, తాను ఘనత పొందాలి. – పారశీక సామెత.