ఈ పుట ఆమోదించబడ్డది

770

ఒక యోగి ఆత్మకథ

రూపొందించడానికి సరిపోయి ఉండేవి. భయం, సంక్షోభం, కరువు, మహామారి విలయ తాండవం చేసే ప్రపంచం కాదు నెలకొనవలసింది; శాంతి, సౌభాగ్యం, విస్తరించే జ్ఞానం ఉండే విశాల ప్రపంచం.

గాంధీగారి అహింసావాణి, మానవుడి అత్యున్నత చేతనను స్పృశిస్తుంది. దేశాలు ఇకముందు, చావులో కాక, బతుకులో మైత్రి ఏర్పరుచుకోవాలి; నాశనంలోకాదు, నిర్మాణంలో; ద్వేషంతోకాదు, ప్రేమమయమైన సృజనశీలక అద్భుతచర్యలతో.

“ఎవరయినా హాని కలిగించినప్పుడు క్షమించాలి,” అంటుంది మహాభారతం. “మానవుడు క్షమిస్తూ ఉండటంవల్ల నే మానవజాతి మనుగడ సాగుతోందని చెప్పారు. క్షమించడం పవిత్రత; క్షమవల్లనే విశ్వం సుసంఘటితమై ఉంది. క్షమ బలవంతుల బలం; క్షమ త్యాగం; క్షమ మనశ్శాంతి. క్షమ, సాధుస్వభావం ఆత్మసంయమంగలవాళ్ళ గుణాలు. అవి శాశ్వత సద్గుణానికి చిహ్నాలు.”

క్షమ - ప్రేమల ధర్మంలోంచి సహజంగా పుట్టిందే అహింస. ధర్మ యుద్ధంలో ప్రాణనష్టమే అవసరమయితే, జీసస్ మాదిరిగా, తన రక్తం ధారపొయ్యడానికి సిద్ధంగా ఉండాలి కాని, ఇతరుల రక్తం పారించడానికి కాదు,” అని కంఠోక్తిగా చెప్పారు గాంధీగారు. “తత్ఫలితంగా, ప్రపంచంలో రక్తం చిందడం క్రమంగా తగ్గుతుంది.”

ప్రేమతో ద్వేషానికి, అహింసతో హింసకూ తట్టుకొని, ఆయుధాలు ధరించడం కంటె, నిర్దాక్షిణ్యంగా జరిగే ఊచకోతకు సిద్ధపడిన భారతీయ సత్యాగ్రహులగురించి ఎప్పుడో ఒకనాడు మహేతిహాస గ్రంథాలు వెలువడకపోవు. తత్ఫలితంగా కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులు అవమానం పొంది, తన ప్రాణంకన్న ఇతరుల ప్రాణాలకు ఎక్కువ విలువ ఇచ్చే