ఈ పుట ఆమోదించబడ్డది

764

ఒక యోగి ఆత్మకథ

గ్రహులు - క్రియాయోగ దీక్ష తీసుకోదలిచిన శ్రీ దేశాయి, డా॥ పింగళే మరికొందరు - గదిలోకి వచ్చారు.

నేను మొదట, ఆ చిన్న తరగతికి, శారీరకమైన యోగదా అభ్యాసాలు నేర్పాను. శరీరం ఇరవై భాగాలుగా ఉన్న సంగతి ఆంతరికంగా దర్శిస్తాం; ప్రతి భాగంలోకి శక్తి వెళ్ళేటట్టుగా, సంకల్పం దాన్ని నిర్దేశిస్తుంది. కాస్సేపట్లోనే, నా ఎదుట ప్రతి ఒక్కరూ స్వయంచలన మానవ యంత్రంలా స్పందించడం చూశాను. గాంధీగారి శరీరంలో ఇరవై భాగాల్లోనూ స్పందన ఫలితాన్ని చూడడం సులువే; చూసేవాళ్ళకి, ఆయన శరీర భాగాలు ఎప్పుడూ పైకి కనిపిస్తూనే ఉంటాయి! ఆయన చాలా సన్నగా ఉన్నా, వికార మనిపించేటంత బక్కగా ఉండరు; ఆయన ఒంటిమీది చర్మం నున్నగా, ముడతలు లేకుండా ఉంటుంది.[1]

తరవాత నేను, వాళ్ళకి క్రియాయోగమనే ముక్తిదాయక యోగప్రక్రియ ఉపదేశించాను.

మహాత్ములు ప్రపంచమతాలన్నిటినీ శ్రద్ధాసక్తులతో అధ్యయనం చేశారు. జైనగ్రంథాలు, బైబిలు కొత్త నిబంధన గ్రంథం, టాల్‌స్టాయ్ సమాజ శాస్త్రీయ రచనలు - గాంధీగారి అహింసా సిద్ధాంతపరమైన దృఢ విశ్వాసాలకు ప్రధానమైన ఆధారాలు[2] ఈ మూడూ. ఆయన తమ అభిమతాన్ని ఇలా వ్యక్తం చేశారు:

  1. గాంధీగారు, చిన్నవీ పెద్దవీ కూడా, చాలా ఉపవాసాలు చేశారు. ఆయన ఆరోగ్యం చాలా మంచిది. ‘డయట్ అండ్ డయట్ రిఫారం; నేచర్ క్యూర్; కీ టు హెల్త్’ అన్న ఆయన పుస్తకాలు, భారతదేశంలో, అహమ్మదాబాదులో నవజీవన్ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి.
  2. థోరో, రస్కిన్, మాజినీ అన్న ఇతర పాశ్చాత్య రచయితల గ్రంథాల్ని కూడా గాంధీగారు నిశితంగా అధ్యయనం చేశారు.