ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

763

గాంధీగారి ముఖంలో ఆసక్తి కనబడింది. “అవి వార్ధాలో పెరిగితే బాగుండును. సత్యాగ్రహులు కొత్త ఆహారాన్ని మెచ్చుకుంటారు.”

“లాస్ ఏంజిలిస్ నుంచి అవొకేడో మొక్కలు కొన్ని తప్పకుండా వార్ధాకు పంపిస్తాను,” అని చెప్పి, “గుడ్లు, మాంసకృత్తులు (ప్రోటీన్లు) ఎక్కువగా ఉండే ఆహారం; ఇవి సత్యాగ్రహులకు నిషిద్ధమైనవా?”

“బీజంలేని గుడ్లు నిషిద్ధం కావు,” అంటూ, వెనకటి సంగతులు తలుచుకుని నవ్వుకున్నారు మహాత్ములు.

“చాలా ఏళ్ళు, నేను వాటి వాడుకను సమ్మతించలేదు. ఇప్పటికీ నే నయితే తినను. మా కోడళ్ళలో ఒక అమ్మాయి ఒకసారి, పోషకాహార లోపంపట్ల ప్రాణం పోయే స్థితికి వచ్చింది; ఆమె గుడ్లు తిని తీరాలని పట్టుపట్టాడు డాక్టరు. నేను ఒప్పుకోలేదు. దాని బదులు మరోటి చెప్పమన్నాను.”

“ ‘గాంధీజీ, బీజంలేని గుడ్లలో శుక్లం ఉండదు; అందులో హత్య ఏమీ ఉండదు,’ ” అన్నాడాయన.

“అప్పుడు నేను సంతోషంగా అనుమతించాను, మా కోడలు ఆ గుడ్లు తినడానికి; తొందరగానే ఆమెకు మామూలు ఆరోగ్యం చేకూరింది.”

అంతకుముందు రోజున గాంధీగారు, లాహిరీ మహాశయుల క్రియాయోగం దీక్ష తీసుకోవాలన్న కోరిక వెల్లడించారు. ఆయన చిత్తశుద్ధికీ జిజ్ఞాసాప్రవృత్తికి నేను ముగ్ధుణ్ణి అయాను. దైవాన్వేషణ విషయంలో ఆయన చిన్నపిల్లవాడి మోస్తరు; “అలాటి వాళ్ళదే స్వర్గరాజ్యం,” అంటూ ఏసుక్రీస్తు, పిల్లల్ని ప్రశంసించాడు. గాంధీగారిలో అటువంటి పరిశుద్ధ గ్రాహకత వెల్లడి అయింది.

నేను మాట ఇచ్చిన దీక్షా సమయం వచ్చింది. కొందరు సత్యా