ఈ పుట ఆమోదించబడ్డది

756

ఒక యోగి ఆత్మకథ

నైష్ఠిక హిందువుకు కొన్ని నిత్యకర్మలు విధించి ఉన్నాయి. ఒకటి ‘భూతయజ్ఞం’; అంటే పశువులకు మేత పెట్టడం. సృష్టిలో అల్పమైన అపరిణత జీవులపట్ల మనిషి తనకున్న బాధ్యతల్ని గ్రహించుకోవాలన్న దానికి ఇది ప్రతీక; ఆ అల్పపరిణత జీవరూపాలు, సహజాతపరంగా దేహస్పృహకు ముడిపడి ఉన్నవి. ఆ దేహస్పృహ మానవ జీవితంలోకి చొచ్చుకు వచ్చింది. అయితే అల్పపరిణత జీవరూపాలకు, మానవజాతికి విశిష్టమైన ముక్తి దాయక వివేక లక్షణం లేదు. ఆ విధంగా భూతయజ్ఞం దుర్బల జీవుల్ని ఆదుకోడానికి మానవుడిలో ఉన్న సంసిద్ధతకు బలం చేకూరుస్తుంది. అదే విధంగా అతడు, ఉచ్చతర అదృశ్యజీవుల అసంఖ్యాక శుభాశీస్సులవల్ల ఊరట పొందుతాడు. అంతేకాకుండా, భూమిలోనూ సముద్రంలోనూ ఆకాశంలోనూ విచ్చలవిడిగా వ్యర్థమయిపోతున్న ప్రకృతి వరప్రసాదాల్ని పునరుజ్జీవింపజేయవలసిన బాధ్యత కూడా మానవుడి మీద ఉంది. ప్రకృతిలో ఉన్న జంతువులకూ మనిషికీ సూక్ష్మలోక దేవతలకూ మధ్య పరస్పర భావసంపర్క రాహిత్యం అనే పరిణామాత్మక అవరోధాన్ని నిగూఢ ప్రేమతో దాటడం జరుగుతున్నది.

ఇతర దైనిక యజ్ఞాలు- ‘పితృయజ్ఞం, నృయజ్ఞం.’ పితృయజ్ఞం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం. మానవుడు, గతానికి తాను ఋణపడి ఉన్నానన్న సంగతి అంగీకరించడానికి చిహ్నమది. నృయజ్ఞం అంటే, ఆగంతుకులకుగాని బీదవాళ్ళకుగాని అన్నం పెట్టటం. మానవుల విషయంలో ఇప్పుడు తనకున్న బాధ్యతలకూ సమకాలికుల విషయంలో తనకున్న విధులకూ అది చిహ్నం.

మధ్యాహ్నం పూట, చిన్న చిన్న అమ్మాయిలకోసం ఏర్పాటుచేసిన గాంధీగారి ఆశ్రమానికి వెళ్ళి నృయజ్ఞం చేశాను. శ్రీ రైట్ నాతోబాటు వచ్చాడు. కారులో పదినిమిషాల ప్రయాణం. పొడుగాటి వన్నెవన్నెల