ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

749

చక్రం ఒకటి ఉంది. మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేకంగా ఇచ్చిన చిన్న పడకగదుల్లో, వీలయినంత కనీసపు సామగ్రి మాత్రమే - నులకతాటితో అల్లిన ఒక్క మంచం మాత్రం ఉంది. వెల్ల వేసిన వంటింట్లో ఒక మూల నీటి కుళాయి ఉంది; మరో చోట వండుకోడానికి ఒక పొయ్యి ఉంది. కాకుల అరుపులూ, పిచికల కిచకిచలూ, పశువుల అంబారవాలూ, రాళ్ళు కొట్టేటప్పుడయే టకటకచప్పుళ్ళూ - నిరాడంబరమైన పల్లెల్లో వినబడే శబ్దాలు మా చెవులకు సోకాయి.

శ్రీ రైట్ యాత్రాదినచర్య (ట్రావెల్ డైరీ) పుస్తకాన్ని గమనించి శ్రీ దేశాయి, దాన్ని తెరిచి, అందులో, గాంధీమహాత్ముల యథార్థానుయాయులు (సత్యాగ్రహులు) అందరూ చేసే సత్యాగ్రహా[1]వ్రత ప్రతిజ్ఞల్ని వరసగా రాశారు.

“అహింస; సత్యం; ఆస్తేయం (దొంగిలించకపోవడం); బ్రహ్మచర్యం; అపరిగ్రహం; కాయకష్టం; జిహ్వను అదుపులో ఉంచుకోడం; నిర్భయం; అన్ని మతాలపట్లా సమాన గౌరవం; స్వదేశీ (దేశంలో తయారైన వస్తువులే వాడడం); అంటరానితనం పాటించక పోవడం, ఈ పదకొండూ వినయవిధేయలతో ప్రతిజ్ఞలుగా పాటించాలి.”

(ఆ మర్నాడు గాంధీగారే స్వయంగా ఈ పేజీమీద సంతకం చేసి తేదీ కూడా వేశారు – ఆగస్టు 27, 1935).

మేము వచ్చిన రెండు గంటల తరవాత నన్నూ నా సహచరుల్నీ భోజనానికి పిలిచారు. మహాత్ములు అప్పటికే, ముంగిలికి ఆయన పఠన మందిరానికి మధ్యలో ఉన్న ఆశ్రమం వసారా కమాను కింద కూర్చుని

  1. “సత్యానికి నిలబడి ఉండడం” అన్నది, ఈ సంస్కృతపదానికి అనువాదం. సత్యాగ్రహమన్నది గాంధీగారు నడిపిన ప్రసిద్ధ అహింసోద్యమం.