ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం

57

డన్నది అతని సూచన కావచ్చు : తాను అప్రయత్నంగా, మహానీయుడైన ఒక సాధువును కలుసుకొన్నాడు; కాని మేము చిత్తశుద్ధితో చేసిన అన్వేషణ, ఒక మహాగురువు పాదసన్నిధిని కాకుండా, అసభ్యమైన ఒక పోలీసు స్టేషనులో ముగిసింది.

హిమాలయాలు అంత దగ్గరలో ఉన్నా కూడా మేము బదిలీలుగా ఉన్నందువల్ల మా కవి ఎంతో దూరమయాయి. స్వేచ్ఛకోసం నా మనస్సు ఉరకలు వేస్తోందని అమర్‌తో చెప్పాను.

“అవకాశం వచ్చినప్పుడు చల్లగా జారుకుందాం. పవిత్రమైన ఋషీకేశానికి కాలినడకన వెళ్ళగలం.” ప్రోత్సాహకరంగా చిరునవ్వు నవ్వాను.

కాని, మా కొక బలమైన ఆధారంగా ఉన్న డబ్బును వాళ్ళు మా దగ్గరినుంచి తీసేసుకోగానే నా జతగాడు నిరాశావాదిగా మారిపోయాడు.

“అల్లాటి ప్రమాదకరమైన అడవి ప్రదేశంలో కనక మనం నడక మొదలెట్టామంటే, చివరికి మనం చేరేది సాధువులుండే చోటికి కాదు- పెద్ద పులుల పొట్టల్లోకి!”

మరి మూడు రోజులకి అనంతుడూ, అమర్ వాళ్ళ అన్నయ్యా వచ్చారు. అమర్ అయితే, తేలికపడ్డ మనస్సుతో వాళ్ళన్నయ్యను ఆప్యాయంగా పలకరించాడు. నేను మాత్రం సమాధాన పరుచుకోలేదు. అనంతన్నయ్యకి ముట్టినవల్లా తీవ్రమైన నిందలకు మించి మరేమీ లేదు.

“నీ మనస్సు కెలా అనిపిస్తుందో నాకు తెలుసురా!” అంటూ మా అన్నయ్య నన్ను సముదాయిస్తూ అన్నాడు. “నేను నిన్ను కోరేదల్లా ఒకటే– కాశీలో మంచి జ్ఞాని ఒకాయన ఉన్నాడు; ఆయన్ని కలుసుకోడానికి నాతో కాశీ రమ్మనీ, నీ కోసం బెంగపెట్టుకున్న నాన్న గారిని