ఈ పుట ఆమోదించబడ్డది

742

ఒక యోగి ఆత్మకథ

“ఈ రోజుల్లో నువ్వు చాలా వేగంగానే సంచారం చేస్తూ ఉన్నప్పటికీ, నిన్ను బొంబాయిలో పట్టుకోడం నా కేమీ కష్టం కాలేదు!”

“గురుదేవా, మీరు పోయినందుకు నే నెంత విలపించిపోయానో!”

“బాగుందోయ్! నేను పోవడమేమిటి? ఏ రకంగా? ఇందులో కాస్త తిరకాసు లేదూ?” శ్రీయుక్తేశ్వర్‌గారి కళ్ళు ప్రేమతోనూ వినోదంతోనూ మిలమిల్లాడుతున్నాయి.

“నువ్వు భూమిమీద కలగన్నావంతే; ఆ భూమిమీద నువ్వు నా స్వప్న శరీరాన్ని చూశావు,” అంటూ ఇంకా చెప్పారాయన. “తరవాత నువ్వా స్వప్నబింబాన్ని సమాధి చేశావు. ఇప్పుడు నువ్వు చూస్తున్న శరీరం ఉందేం - ఇప్పటికీ నువ్వింకా గట్టిగానే చుట్టేసుకుని ఉన్నది - మాంసమయమైన ఈ నా సూక్ష్మతర శరీరం, భగవంతుడి మరో సూక్ష్మతర స్వప్నలోకంలో పునరుత్థానం చెందింది. ఎప్పటికో ఒకనాటికి ఈ సూక్ష్మతర స్వప్నశరీరమూ, సూక్ష్మతర స్వప్నలోకమూ కూడా గతిస్తాయి; అవి కూడా ఎప్పటికీ ఉండిపోయేవి కావు. కలల బుడగలన్నీ చివరికి, చరమ జాగరణ స్పర్శతో పగిలిపోక తప్పదు. అబ్బాయ్, యోగానందా, కలల్నీ వాస్తవాన్ని విడమరిచి చూడు!”

వేదాంత[1] పరమైన ఈ పునరుత్థాన భావన నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పూరీలో గురుదేవుల నిర్జీవకాయాన్ని చూసి ఈయనకోసం విచారించినందుకు నేను సిగ్గుపడ్డాను. మా గురుదేవులు, తమ జీవితాన్నీ భూమిమీద పొందిన మరణాన్నీ ఇప్పటి పునరుత్థానాన్నీ, విశ్వస్వప్నంలో

  1. చావుబతుకులు కేవలం భావనలోని సాపేక్షతలుగా బ్రహ్మ మొక్కటే సత్యమని చెబుతుంది వేదాంతం; సృష్టి అంతా, లేదా ప్రత్యేక అస్తిత్వం, మాయ లేదా మిథ్య. ఈ అద్వైత తత్త్వం శంకరుల ఉపనిషద్వ్యాఖ్యల్లో పరమోత్తమంగా అభివ్యక్తమయింది.