ఈ పుట ఆమోదించబడ్డది

740

ఒక యోగి ఆత్మకథ

“తమ దయవల్ల తెలిసిందండి; ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ నోట మాట రావడం లేదండి.”

ఒక పాటకాని, కథకాని విని అంతకుముందెన్నడూ నేను స్ఫూర్తిమంతమైన జ్ఞానం పొందలేదు. హిందూ పవిత్ర గ్రంథాలు కారణ, సూక్ష్మ లోకాలగురించీ మానవుడి మూడు శరీరకోశాల్నిగురించీ ప్రస్తావించినప్పటికీ, పునరుత్థానం చెందిన మా గురుదేవుల ఆహ్లాదకరమైన సాధికారతతో పోల్చిచూస్తే, ఆ గ్రంథాల్లో చెప్పింది ఎంత దుర్గ్ర్యాహ్యంగా, ఎంత అర్థరహితంగా ఉంటుందో అనిపించింది! ఆయన దృష్టిలో, “యాత్రికు డెవడూ తిరిగిరాని అనన్వేషితదేశం,”[1] ఒక్కటీ లేదు!

“మానవుడి మూడు శరీరాలూ ఒకదాంట్లోకి ఒకటి చొచ్చుకుపోయి ఉంటాయన్న విషయం, అతని త్రిగుణాత్మక ప్రకృతి ద్వారా అనేక మార్గాల్లో వ్యక్తమవుతుంది,” అంటూ చెప్పసాగారు గురుదేవులు. “భూమి మీద మానవుడికి జాగ్రదవస్థలో, దాదాపు ఈ మూడు వాహకాలూ స్పృహలో ఉంటాయి. రుచి చూడ్డం, వాసన చూడ్డం, తాకడం, వినడం, లేదా చూడ్డం వంటి ఇంద్రియానుభవాలు పొందాలని అతడు ఇంద్రియ భోగలాలసుడై తలపెట్టినప్పుడు, అతడు ప్రధానంగా తన భౌతిక శరీరంతో పని చేస్తున్నాడన్న మాట. అంతర్దర్శనం పొందడం, లేదా సంకల్పించడం అన్నవి అతడు ముఖ్యంగా సూక్ష్మశరీరంతో చేస్తున్నాడు. మనిషి ఆలోచిస్తున్నప్పుడు కాని అంతఃపరిశీలనలోనో ధ్యానంలోనో గాఢంగా మునుగుతున్నప్పుడు కాని అతని కారణ శరీరానికున్న వ్యక్తీకరణ శక్తి వెల్లడి అవుతుంది; అలవాటు ప్రకారం కారణ శరీరంతో

సంబంధం పెట్టుకొనేవాడికి ప్రతిభాసంబంధమైన విశ్వభావాలు ఏర్పడతాయి. అంటే, ఒక వ్యక్తిని ‘భౌతిక మానవుడు’గా కాని, ‘శక్తిమంతుడైన

  1. హామ్లెట్ (III, దృశ్యం 1).