ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

737

లేకుండా చేసి, వాళ్ళు కారణ లోకమండలాలకు శాశ్వతంగా వెళ్ళేటందుకు సహాయపడతాడు. లేదా విముక్తాత్ముడు, కారణలోకంలోకి ప్రవేశించి, అక్కడివాళ్ళు కారణశరీరంలో తమ జీవితకాలాన్ని తగ్గించుకొని కైవల్య ప్రాప్తిపొందడానికి తోడ్పడతాడు.”

“పునరుత్థానం చెందిన మహాత్మా! ఆత్మలు ఈ మూడు లోకాలకూ తిరిగి రావాలన్న నిర్బంధం కలిగించే కర్మనుగురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి.” అన్నాను. సర్వజ్ఞులైన నా గురుదేవులు చెప్పేది ఎప్పటికీ అలా వింటూనే ఉండగలననిపించింది. ఆయన భూమిమీద గడిపిన జీవితంలో ఏ సమయంలోనూ నేనింత జ్ఞానాన్ని ఒంటబట్టించుకోలేకపోయాను. ఇప్పుడు మొట్టమొదటిసారిగా, చావుబతుకుల చదరంగం బల్లమీదుండే నిగూఢమయిన అంతరాల్నిగురించి సుస్పష్టమూ సునిశితమూ అయిన జ్ఞానం పొందుతున్నాను.”

“మానవుడు సూక్ష్మలోకాల్లో శాశ్వతంగా ఉండడం సంభవించేలోగా, అతడు తన భౌతికకర్మను, లేదా కోరికల్ని పూర్తిగా అనుభవిందాలి,” అంటూ వివరించారు గురుదేవులు, ఆహ్లాదకరమైన కంఠస్వరంతో. “సూక్ష్మలోకాల్లో రెండురకాల జీవులు ఉంటారు. భూలోక కర్మను ఇంకా క్షయం చేసుకోవలసినవాళ్ళనూ ఆ కారణంగా తను కర్మ సంబంధమైన ఋణాన్ని తీర్చుకోడానికి స్థూలమైన ఒక భౌతికదేహంలో ఉండవలసినవాళ్ళనూ భౌతిక మరణానంతరం, సూక్ష్మలోకానికి వచ్చే శాశ్వతవాసులుగా కాకుండా, [చుట్టపు చూపుగా] తాత్కాలికంగా వచ్చే సందర్శకులుగా మాత్రమే పరిగణించాలి.”

“భూలోకంలో కర్మఫలానుభోగం పూర్తికాని జీవులకు సూక్ష్మలోకమరణం సంభవించిన తరవాత విశ్వభావాల ఉన్నత కారణమండలం లోకి వెళ్ళడానికి అనుమతి లభించదు. పదహారు స్థూలతత్త్వాలున్న తమ