ఈ పుట ఆమోదించబడ్డది

728

ఒక యోగి ఆత్మకథ

ఆయుఃప్రమాణంతో పోల్చి చూస్తే). సెక్వోయియా వృక్షాలు ఇతర వృక్షాలకన్న కొన్ని వేల ఏళ్ళు బతికేటట్టుగాను, చాలామంది అరవై ఏళ్ళు నిండకముందే చనిపోతున్నప్పటికీ కొందరు యోగులు అనేకవందల ఏళ్ళు బతుకుతున్నట్టుగాను అసాధారణ వ్యక్తులు, సూక్ష్మమండలంలో సుమారు రెండువేల ఏళ్ళు బతుకుతారు.

“సూక్ష్మలోక జీవి జ్యోతిర్మయదేహాన్ని విడిచేసే సమయంలో యముడితో కష్టపడి పెనుగులాడక్కర్లేదు.”

“అయినా ఈ జీవులు సూక్ష్మతరమైన కారణ శరీరంకోసం సూక్ష్మరూపాన్ని విడవాలన్న ఆలోచన వచ్చేసరికి కొద్దిగా గాభరా పడతారు. సూక్ష్మలోకంలో, కోరుకోని చావూ జబ్బూ ముసలితనమూ ఉండవు. ఈ భయాలు మూడూ భూలోకానికి పట్టిన శాపాలే; ఇక్కడ మనిషి, బతకడానికి గాలీ అన్నమూ నిద్రా అవసరమైన దుర్బల భౌతికకాయమే తానని దాంతో పూర్తిగా మమైకమయిపోవడానికి తనచేతనను అనుమతిస్తాడు.”

"భౌతికమరణంలో ఊపిరి పోతుంది; మాంస సంబంధమైన కణాలు విఘటనం చెందుతాయి. కాని, సూక్ష్మ శరీరమరణంలో ప్రాణ కణికలు చెల్లాచెదరయి పోతాయి; అవి సూక్ష్మలోకజీవుల శరీరాలకి ప్రాణసంఘటన కావించిన విశ్వశక్తి తాలూకు ప్రత్యక్షీకృత ఘటకాంశాలు. భౌతిక మరణసమయంలో మనిషికి ఒంటిమీద స్పృహపోతుంది. సూక్ష్మలోకంలో ఉన్న తన సూక్ష్మశరీరం స్పృహకు వస్తుంది. నిర్ణీత సమయంలో సూక్ష్మలోక మరణాన్ని అనుభవించి తద్వారా మనిషి, సూక్ష్మలోక జననమరణాల స్పృహనుంచి భౌతిక జననమరణాల స్పృహకు సాగుతాడు. సూక్ష్మ, స్థూల శరీరకోశాల ఆవర్తన చక్రాలు జ్ఞానం ర్ణిర్గంచని జీవులందరికీ అనివార్యమైన భవితవ్యాలు. పవిత్ర గ్రంథాల్లో ఆసనరకాల కిచ్చిన నిర్వచనాలు ఒక్కొక్కప్పుడు, ఆనందమయ సూక్ష్మ