ఈ పుట ఆమోదించబడ్డది

726

ఒక యోగి ఆత్మకథ

వెలుతురు. నీటి బుగ్గలనుంచి ఎగిసిపడి ప్రవహించే అమృతాన్ని పానం చేస్తారు. భూమిమీద సాధారణంగా, మానవుల అదృశ్యబింబాల్ని ఆకాశతత్త్వం (ఈథర్) లోంచి రప్పించి టెలివిజన్ సాధనం ద్వారా కళ్ళకు కట్టించినట్టే, దేవుడు సృష్టించిన ఆకాశతత్త్వంలో తేలే కూరగాయలు, మొక్కలు, పండ్ల అగోచర సూక్ష్మ ప్రతిరూపాల్ని సూక్ష్మలోకంలో, అక్కడుండేవాళ్ళ ఆదేశాలవల్ల రూపొందించవచ్చు. అదే విధంగా, సూక్ష్మలోక జీవుల ఉద్దామ కల్పనల్ని అనుసరించి విశాలవనాల్ని సాక్షాత్కరింప జేయనూ వచ్చు; తిరిగి వాటిని ఆకాశతత్త్వసహజంగా అదృశ్యం కావించనూ వచ్చు.”

“హిరణ్యలోకంవంటి స్వర్లోక మండలాల్లో ఉండేవాళ్ళు తిండి తినవలసిన అవసరం లేకుండా దాదాపు స్వేచ్ఛ పొందినప్పటికీ కూడా, కారణలోకంలో దాదాపు పరిపూర్ణతాసిద్ధి పొందిన జీవుల అనియత అస్తిత్వం, అంతకన్న ఉన్నతస్థితిలో ఉంటుంది; వాళ్ళ ఏకైక ఆహారం ఆనందామృతమే.”

“సూక్ష్మలోకవ్యక్తి, భూలోకంలో వివిధ జన్మల్లో పొందిన తండ్రుల్నీ తల్లుల్నీ భార్యల్నీ భర్తల్నీ పిల్లల్నీ స్నేహితుల్నీ అనేక మందిని చూస్తాడు. వాళ్ళు సూక్ష్మవిశ్వంలోని వివిధ భాగాల్లో అప్పుడప్పుడు అవుపిస్తూ ఉంటారు.[1] అంచేత, ఎవరిమీద ప్రత్యేకాభిమానం చూపించాలో తెలుసుకోలేకపోతున్నాడు; ఈ విధంగా అతడు, జీవు

  1. మానవుడు అందరినీ సమానంగా ఎందుకు ప్రేమించాలని ఒకసారి బుద్ధుణ్ణి ఒకరు అడిగారు. “ఎందుకంటే, ప్రతిమనిషికీ, అసంఖ్యాకమైన వివిధ జన్మల్లో ఇతరుడు ప్రతి ఒక్కడూ (ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రూపంలో - జంతురూపంలోకాని, మానవరూపంలో కాని) ప్రియమైనవాడు అయి ఉంటాడు. కనక,” అని ఆ దేశికోత్తముడు జవాబిచ్చాడు.