ఈ పుట ఆమోదించబడ్డది

718

ఒక యోగి ఆత్మకథ

రోదసిలో భౌతికమైన అనేక సూర్యగ్రహాలూ నక్షత్రాలు సంచరించేటట్టుగానే లెక్కలేనన్ని సూక్ష్మ సౌర, నక్షత్ర మండలాలు కూడా ఉంటాయి. సూక్ష్మలోక సూర్యచంద్రులు ఈ సూర్యచంద్రులకన్న అందంగా ఉంటారు. సూక్ష్మలోక తేజోమండలాలు తేజస్వంతమైన మేరు ప్రభామండలాన్ని (ఆరోరా బొరియాలిస్) పోలి ఉంటాయి. ఈ సూక్ష్మలోక సౌరమేరుప్రభ, మందకిరణ చంద్రమేరుప్రభ కన్న మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. సూక్ష్మలోకంలో రాత్రీ పగలూ, భూమిమీది వాటికంటె దీర్ఘమైనవి.”

‘‘సూక్ష్మవిశ్వం అత్యంత ఆకర్షణీయమైనదీ పరిశుభ్రమైనదీ పరిశుద్ధమైనదీ సువ్యవస్థితమైనదీ. నిర్జీవగ్రహాలూ చవిటి పర్రలూ అక్కడ లేనే లేవు. భూలోకానికి కళంకప్రాయమైన సూక్ష్మజీవులు (బాక్టీరియా), పురుగులు, పాములు వంటివి అక్కడ ఉండవు. శీతోష్ణస్థితులూ ఋతువులూ భూలోకంలో మాదిరిగా ఉండవు; సూక్ష్మమండలంలో నిత్య వసంత ఋతువుతో సమశీతోష్ణస్థితి నిలిచి ఉంటుంది. అప్పుడప్పుడు, వెలుగులీనే తెలిమంచూ, వన్నె వన్నెల వెలుగుల వానలు కురుస్తూ ఉంటాయి. సూక్ష్మలోకాలంతటా మాణిక్య సరోవరాలూ, మిలమిల మెరిసే సముద్రాలూ, ఇంద్రచాప నదులూ సమృద్ధిగా ఉంటాయి.”

“మామూలు సూక్ష్మవిశ్వంలో - అంటే, హిరణ్యలోకమనే సూక్ష్మతర సూక్ష్మ స్వర్గంలో అని కాదు – భూమినుంచి దాదాపు ఇటీవల వచ్చిన, కొన్నికోట్ల సూక్ష్మ జీవాత్మలు ఉంటాయి. అంతే కాకుండా, దేవతాశక్తులూ, మత్స్యకన్యలూ, చేపలూ, జంతువులూ, పిశాచాలూ, భూతాలూ, దైవాంశ సంభూతులూ, అదృశ్య శక్తులూ కూడా అసంఖ్యాకంగా ఉంటాయి. ఇవన్నీ కర్మల గుణగుణాల్ని బట్టి వేరు వేరు సూక్ష్మ గ్రహాల్లో నివసిస్తాయి. మంచిశక్తులకూ చెడ్డశక్తులకూ గోళాకార భవ